Home సినిమా ఆ టాప్ హీరోయిన్ నాని ని రిజెక్ట్ చేసిందా! ఫ్యాన్స్ ఏమంటున్నారు – Andhra Waves

ఆ టాప్ హీరోయిన్ నాని ని రిజెక్ట్ చేసిందా! ఫ్యాన్స్ ఏమంటున్నారు – Andhra Waves

by
0 comments
ఆ టాప్ హీరోయిన్ నాని ని రిజెక్ట్ చేసిందా! ఫ్యాన్స్ ఏమంటున్నారు




-ఎందుకు ఆ విధంగా చేసింది
-నాని ప్రస్తుతం ఏం చేస్తున్నాడు
-అభిమానులు ఏమంటున్నారు

తమని మెస్మరైజ్ చేసే విషయంలో నాచురల్ స్టార్ ‘నాని'(నాని)ఏ మాత్రం తగ్గడనే నమ్మకం అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చాలా బలంగా ఉంది. అందుకు తగ్గట్టే కొంత కాలం నుంచి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఏ హీరోకి లేని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. పైగా వేటికవే విభిన్న చిత్రాలు కూడా కావడంతో సిల్వర్ స్క్రీన్ పై నాని చేస్తున్న వీరవిహారం ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి ‘ది ప్యారడైజ్'(ది ప్యారడైజ్)అనే విభిన్నమూవీతో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు.వచ్చే ఏడాది మార్చి 26న విడుదల అవుతుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్యారడైజ్ క్యాస్టింగ్ విషయానికి వస్తే నాని సరసన హీరోయిన్ గా ఎవరు జత కట్టబోతున్నారనే విషయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. డ్రాగన్ బ్యూటీ ‘కయదు లోహర్'(కయదు లోహర్)దాదాపుగా ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై మేకర్స్ అధికారకంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ మూవీలో మొదట హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని మేకర్స్ బావించారంట. జాన్వీ ,నాని కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంటుందని భావించి జాన్వీ ని క్యారక్టర్ గురించి వివరించారని, కానీ జాన్వీ రిజెక్ట్ చేసిందని అంటున్నారు. దీనికి కారణం రామ్ చరణ్(రామ్ చరణ్)తో చేస్తున్న’పెద్ది'(పెద్ది)తో జాన్వీ ఫుల్ శాతం ఉండటంతో రెండు సినిమాల డేట్స్ క్లాష్ కావడమే ప్రధాన కారణమనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇది కూడా చదవండి: హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్

ఇక ఈ న్యూస్ తర్వాత అభిమానులు సోషల్ మీడియా వేదికగా చూసిన నాని, జాన్వీ ఫెయిర్ బాగుంటుందని ఫ్యూచర్ లో అయినా ఇద్దరు కలిసి మూవీ చేయాలని కోరుకుంటున్నారు. ‘పెద్ది’లో ‘అచ్చాయమ్మ’ అనే క్యారక్టర్‌లో జాన్వీ చేస్తుండగా ఆ క్యారక్టర్‌కి సంబంధించి ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird