Home Latest News నక్స‌ల్ ఫ్రీ కాంట్రీ ఎలాగో….వైసీపీ రాక్షసుల్ ఫ్రీ స్టేట్ సాధ్యమేనా? | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్| వైసీపీ| నక్సల్ విముక్త దేశం| సీఎం చంద్రబాబు| ఛత్తీస్‌గఢ్| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

నక్స‌ల్ ఫ్రీ కాంట్రీ ఎలాగో….వైసీపీ రాక్షసుల్ ఫ్రీ స్టేట్ సాధ్యమేనా? | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్| వైసీపీ| నక్సల్ విముక్త దేశం| సీఎం చంద్రబాబు| ఛత్తీస్‌గఢ్| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
నక్స‌ల్ ఫ్రీ కాంట్రీ ఎలాగో....వైసీపీ రాక్షసుల్ ఫ్రీ స్టేట్ సాధ్యమేనా? | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్| వైసీపీ| నక్సల్ విముక్త దేశం| సీఎం చంద్రబాబు| ఛత్తీస్‌గఢ్| డీజీపీ శివధర్ రెడ్డి


డిసెంబర్ 21, 2025 11:16AMన పోస్ట్ చేయబడింది


ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు. 2026 మార్చి 31 నాటికి నక్స‌ల్ ఫ్రీ కాంత్రీగా భార‌త్ ని ఎలా చేస్తున్నారో.. ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ త‌లుచుకుంటూ జ‌గ‌న్ వెంట ఉన్న ఫ్యాక్ష‌నిస్టుల‌ను, గూండాల‌ను, మ‌ర్డ‌రిస్టుల‌ను అలాగే లేకుండా చేయ‌డం ఏమంత క‌ృష్టం కాద‌న్న కామెంట్ చేశారా. దీనితో ఒక్కొక్కరి ఫీజులెగిరిపోయాయ్. మ‌రీ ముఖ్యంగా జగ‌న్ అండ్ కో ఉలిక్కి ప‌డింది.

ఈ కామెంట్ ప‌వ‌న్ ఎందుకు చేయాల్సి వ‌చ్చిందంటే.. అధికారులు సైతం జ‌గ‌న్, ఆయ‌న వెన‌కున్న ఫ్యాక్ష‌న్ ముఠాలను చూసి భ‌య‌ప‌డుతుండ‌టం వ‌ల్ల‌. వారికంటూ ధైర్యం అందించే దిశ‌గా ప‌వ‌న్ ఈ కామెంట్ చేసినట్టు క‌నిపిస్తోంది.

దీనంత‌టిని బ‌ట్టి చూస్తే.. ప్ర‌భుత్వం త‌లుచుకుంటే జ‌గ‌న్ని, ఆయ‌న పార్టీని నామ రూప‌ల్లేకుండా చేయ‌డం పెద్ద ప‌నేం కాద‌ని సూచిస్తుంది. నిజానికి అది సాధ్యమేనా? అంటే దగ్‌గ్‌ర్లో ఉన్న ఉదాహ‌ర‌ణ న‌క్స‌లైట్ల‌ను భార‌త ప్ర‌భుత్వం రూపుమాపుతుండ‌టం కంటి ముందు క‌నిపిస్తూనే ఉంది.

నిన్న మొన్న తెలంగాణ డీజీపీ శివ‌ధర్ చెప్పే మాట‌ల‌ను అనుస‌రించి చెబితే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లొంగిపోవ‌ల్సిన మావోయిస్టుల సంఖ్య కేవ‌లం 54 మంది మాత్ర‌మేన‌ట‌. యాభై నాలుగు మంది అంటే చాలా తక్కువ సంఖ్య. ఇప్ప‌టికే కొన్ని వంద‌లాది మంది మావోయిస్టులు ఇటు ఛ‌త్తీస్ గ‌ఢ్, అటు మహారాష్ట్ర‌తో పాటు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల ముందు లొంగిపోతున్న దృశ్యాలు లేదా ఎన్ కౌంట‌ర్ అవుతున్న దృశ్యాలు మ‌న‌కు క‌నిపిస్తూనే ఉన్నాయి.

ఈ యాంగిల్లో చూస్తే జగ‌న్, ఆయ‌న వెన‌కున్న ర‌ప్ప ర‌ప్ప బ్యాచ్‌ని అంత మొందించ‌డం పెద్ద ప‌నేం కాదు. ఇప్ప‌టికే జగ‌న్ త‌న 5 ఏళ్ల పాల‌నా కాలంలో చేసిన అవినీతి అక్ర‌మాల‌కు సంబంధించిన ప్ర‌తిదీ త‌వ్వి పోస్తున్నారు సీఐడీ అధికారులు. ఇంకా ఎన్నో డిపార్ట్ మెంట్లు జ‌గ‌న్ చుట్టూ అల్లుకుని ఉన్న అవినీతి ప్ర‌పంచం డికోడ్ చేస్తున్నారు. వరుస అరెస్టులు చేస్తున్నారు.

అలాంటిది జగ‌న్ చుట్టూ ఉన్న వారితో పాటు జగ‌న్ ని సైతం జైలు పాలు చేయ‌డం లేదా ఆయ‌న అనుచ‌ర‌గ‌ణాన్ని అరెస్టు చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. దానికి తోడు ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాలను బ‌ట్టి చూస్తే.. ఇలాంటి వారు ఫ‌లానా కేసుల్లో ఫ్రేమ్ అయితే ఆ త‌ర్వాత ఉన్న ఆ అర‌కొర, బొటాబొటి ప‌ద‌వుల‌ను కూడా కోల్పోయింది జైల్లో చిప్ప కూడు తినాల్సి వ‌స్తుంది. మ‌రో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ లా జ‌గ‌న్ ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం మారాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి జగ‌న్ గో గంగ‌మ్మ జాత‌ర రివ‌ర్స్ లో ప‌డేలా ఉన్న‌ట్టు చూపుతుంది. దీంతో చెప్పేదేముందీ జ‌గ‌న్ రాక్ష‌సుల్ ఫ్రీగా ఏపీ స్టేట్ అవ‌త‌రించినా అవ‌త‌రిస్తుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird