
-ఎవరు వాళ్ళు?
-ఏం చెప్పింది
-సంచలనంగా మారిన స్పీచ్
రామ్ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర’ రెండు భాగాల్లో అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించిన భామ రాధిక ఆప్టే. ఈ చిత్రమే ఆమె మొదటి తెలుగు మూవీ. ఆ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ తో లెజండ్, లయన్ వంటి చిత్రాలలో జత కట్టి మరింత దగ్గరయ్యింది. రీసెంట్ గా ఆమె తన సినీ జర్నీకి 20 ఏళ్లు కార్యక్రమం సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
రాధికా ఆప్టే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని దక్షిణాది సినిమాల్లో నటించాల్సి వచ్చింది.కానీ ఆయన సినిమా సెట్స్‌లో ఎదురైన అనుభవాలు తీవ్రంగా కలచివేసాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో షూటింగ్‌లు జరిగేటప్పుడు సెట్‌లో నేను మాత్రమే మహిళని. మహిళల శరీరాల గురించి అసంబద్ధమైన జోకులు వేయడం, ఛాతీ ప్యాడింగ్ వాడాలని ఒత్తిడి చేయడం వంటి ఘటనలు అతనిపై తీవ్ర ప్రభావం చూపాయి. నేను సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటాను. కానీ ఆ రోజులని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నా గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది. బాలీవుడ్‌లోని కొందరు పెద్ద వ్యక్తుల నిజస్వరూపాలు కూడా నాకు తెలుసు. నాకు వచ్చిన సినిమా ఆఫర్ల సందర్భంగా కొందరిని కలిసాను. వారితో మాట్లాడిన తర్వాత ఇక జీవితంలో మళ్లీ వారిని కలవకూడదని నిర్ణయించుకున్నా. వాళ్లు చాలా పేరున్న వ్యక్తులు. వారి పేర్లు చెబితే అందరూ షాకవుతారు అంటూ చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: ఆంధ్ర కింగ్ తాలూకా ఓటిటి డేట్ ఇదే
తమిళనాడులోని వేలూరు కి చెందిన రాధికా ఆప్టే 2005లో ‘వా లైఫ్ హో తో అసి’ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హిందీలో దాదాపు పదిహేను చిత్రాల వరకు చేసింది. దాదాపుగా బారతీయ అన్ని భాషల్లోను మెప్పించిన రాధిక వెబ్ సిరీస్‌లో తన సత్తా చాటుతుంది. ఈ ఏడాది జనవరిలో లాస్ట్ డేస్ అనే అమెరికన్ ఇంగ్లీష్ మూవీలో కనిపించింది, ఈ నెల 12 న సాలి మహబ్బత్ అనే వెబ్ సిరీస్ తో అడుగుపెట్టింది.
