Home Latest News పాతబస్తీలో రూ. 400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా | పాత నగరం| హైడ్రా| రెవెన్యూ అధికారులు| బండ్లగూడ| హైదరాబాద్ జిల్లా| మహ్మద్ నగర్| లలిత్‌బాగ్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ ప్రభుత్వం| తెలంగాణ పోలీసులు| PM MODI| హోంమంత్రి అమిత్ షా హైడ్రామా – Andhra Waves

పాతబస్తీలో రూ. 400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా | పాత నగరం| హైడ్రా| రెవెన్యూ అధికారులు| బండ్లగూడ| హైదరాబాద్ జిల్లా| మహ్మద్ నగర్| లలిత్‌బాగ్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ ప్రభుత్వం| తెలంగాణ పోలీసులు| PM MODI| హోంమంత్రి అమిత్ షా హైడ్రామా – Andhra Waves

by andhra andhrawave
0 comments
పాతబస్తీలో రూ. 400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా | పాత నగరం| హైడ్రా| రెవెన్యూ అధికారులు| బండ్లగూడ| హైదరాబాద్ జిల్లా| మహ్మద్ నగర్| లలిత్‌బాగ్| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ ప్రభుత్వం| తెలంగాణ పోలీసులు| PM MODI| హోంమంత్రి అమిత్ షా హైడ్రామా


డిసెంబర్ 19, 2025 2:46PMన పోస్ట్ చేయబడింది


పాత బస్తీలో గ‌జం ఖాళీ జాగా లేకుండా ల‌క్ష‌లాది నివాసాలున్న చోట‌.. ఏకంగా 7 ఎక‌రాల‌ను ఓ ప్ర‌బుద్ధుడు క‌బ్జా చేస్తే.. ఆ భూమిని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. పోలీసు స్టేష‌న్‌లో కేసుల‌కు వెర‌వ‌కుండా.. కోర్టు ఫైన్లు కూడా ప‌ట్టించుకోకుండా.. చుట్టూ ఇనుప రేకుల‌తో లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండా ప్ర‌హ‌రీ నిర్మించి.. ఆక్ర‌మ‌ణ‌లో ఉన్నవారిని హైడ్రా ఖాళీ చేయించింది. తనిఖీ అధికారుల స‌మ‌క్షంలో.. పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఇనుప రేకుల ప్ర‌హ‌రీని తొల‌గించి.. అక్క‌డ హైడ్రాన్‌సింగ్ ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ భూమిగా వివరాలు నిర్ధారించూ హైడ్రా బోర్డులు పెట్టింది. దీంతో అక్క‌డి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న పాత‌బ‌స్తీలో గ‌జం జాగా దొర‌క‌ని ప్రాంతంలో ఏకంగా 7 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌డం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా శుక్రవారం కాపాడిన 7 ఎకరాల భూమి విలువ దాదాపు రూ. 400 కోట్ల వ‌ర‌కూ‌ని అధికారులు అంచ‌నా వేశారు. క‌బ్జాదారులు మాయం చేసిన చెరువుతో పాటు.. నాలాల‌ను పున‌రుద్ధ‌రిస్తే బ‌మృక్‌నుద్దౌల మాదిరి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

కేసులున్నా వెర‌వ‌ని క‌బ్జాదారులు.

హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ విలేజ్‌లోని మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతం, రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్:ఎఫ్, వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 2 ఎకరాలు కబ్జా అయి.. నివాసాలు వచ్చేశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా కబ్జాలో ఉన్న 7 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం అక్క డ చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.

కానీ ఆ చెరువు లేకుండా ఆన‌వాళ్లు ఎక్క‌డా మట్టితో క‌బ్జాదారులు క‌ప్పేశారు. ఈ భూమిని కబ్జా చేసి తనదంటూ ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు ఇతరులు పోరాడుతున్నారు. వీరి పై భవ పెట్టారుపురం పోలీసు స్టేషనులో అధికారులు కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయ‌న వార‌సులు ఒక ప‌క్క‌న ఈ భూమి త‌మ‌దంటూ చెబుతుండ‌గా.. వారి వ‌ద్ద నుంచి ప‌ట్టాభి రామి రెడ్డి కొన్నానంటూ మ‌రోవైపు క‌బ్జాలో భాగ‌స్వామ్యం అయ్యాడు.

ఈ మేర‌కు కోర్టులో కేసు కూడా వేశాడు. అయితే ప్రభుత్వ భూమిని ఏ ప్రాతిప‌దిక‌న త‌న‌దిగా చెప్పుకుంటార‌ని.. కోర్టు స‌మ‌యం వృథా చేసినందుకు కోటి రూపాయ‌లు ఫైన్ కూడా వేసింది. అయినా కబ్జాదారులు ఖాళీ చేయకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

స్థానికుల హర్షం..

మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతంలో, రైల్వే ట్రాక్ సమీపంలోని ప్రభుత్వ భూమితో పాటు నాలా, కుంట ను కబ్జా దారుల చెర నుంచి విముక్తి క‌ల్పించిన హైడ్రాకు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే.. స్థానికంగా విచారించి.. వెంట‌నే చార్య‌లు తీసుకోవ‌డాన్ని కుమ్మ‌రి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్ర‌తినిధులు ఆనందం వ్య‌క్తం చేశారు.

రెండు కమ్యూనిటీల మధ్య ఉన్న సున్నితమైన ప్రాంతంలో క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్ర‌య‌త్నించ‌డం వివాదంగా మారింది. వీరి వెనుక బడాబాబులున్నారంటూ ఫిర్యాదులు ఉన్నాయి. ఈ అక్రమ ఆక్రమణలపై గతంలోనే బండ్లగూడ తహసీల్దార్, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేశారు.

కోర్టులు కూడా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కబ్జాలు ఖాళీ చేయకుండా ప్లాట్లు చేసి అమ్ముకోవాల ని ప్రయత్నించటం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అటువైపు ఎవరూ వెళ్లడానికి వీలు లేకుండా చేశారంటూ వాపోయారు. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్‌కి అభినందనలు తెలిపారు. ఆక్రమణదారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.. అక్క‌డ నాలాతో పాటు.. చెరువును పున‌రుద్ధ‌రిస్తే పాత‌బ‌స్తీలో చాలా ప్రాంతాల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పుతుంద‌ని స్థానికులు గుర్తించారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird