Home Latest News భార్యపైన తనకున్న ప్రేమను చాటుకున్న ఓ రైతు | రంగారెడ్డి జిల్లా| మొయినాబాద్ మండలం| చిలుకూరు గ్రామం| కళ్లెం నరసింహా రెడ్డి| కళ్లెం లక్ష్మి| విగ్రహావిష్కరణ| జిమ్మీ కార్టర్| అమెరికా| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

భార్యపైన తనకున్న ప్రేమను చాటుకున్న ఓ రైతు | రంగారెడ్డి జిల్లా| మొయినాబాద్ మండలం| చిలుకూరు గ్రామం| కళ్లెం నరసింహా రెడ్డి| కళ్లెం లక్ష్మి| విగ్రహావిష్కరణ| జిమ్మీ కార్టర్| అమెరికా| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
భార్యపైన తనకున్న ప్రేమను చాటుకున్న ఓ రైతు | రంగారెడ్డి జిల్లా| మొయినాబాద్ మండలం| చిలుకూరు గ్రామం| కళ్లెం నరసింహా రెడ్డి| కళ్లెం లక్ష్మి| విగ్రహావిష్కరణ| జిమ్మీ కార్టర్| అమెరికా| సీఎం రేవంత్ రెడ్డి


డిసెంబర్ 19, 2025 7:49PMన పోస్ట్ చేయబడింది


రంగారెడ్డి నిర్మాణం మొయినాబాద్ మండలంలో ఉన్న చిలుకూరు గ్రామంలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి. 89 ఏళ్ల వయసులోనూ తన జీవిత సహచరిపై ఉన్న అపారమైన ప్రేమను చాటుతూ ఓ రైతు తన భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన దృశ్యాన్ని చూసిన వారు కంటతడి పెట్టుకున్నారు. కళ్లెం నర్సింహారెడ్డి, లక్ష్మి దంపతులు… వీరు చిలుకూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు.

గత సంవత్సరం క్రితం భార్య లక్ష్మి మరణించింది. దీంతో భార్య లక్ష్మి ప్రధమ వర్ధంతి సందర్భంగా కళ్లెం నర్సింహా రెడ్డి, తన వ్యవసాయ క్షేత్రంలో భార్య లక్ష్మీ విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని కూడా తయారు చేసి విగ్రహావిష్కరణ చేశారు. కూతుళ్లు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయన కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం ఆమె పక్కనే తన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.

ముప్పై సంవత్సరాల పాటు అమెరికాలో వ్యవసాయం చేస్తూ, ఉత్తమ వ్యవసాయ సాంకేతికతను అమలు చేసిన నర్సింహా రెడ్డి, ఆ కాలంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన చిలుకూరులో స్థిరపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు.

తన ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్న భార్య లక్ష్మీ మరణించడంతో నర్సింహా రెడ్డి ఒంటరిగా మిగిలిపోయారు. అయితే ఆమె జ్ఞాపకాలను మరచి పోకుండా ఉండేందుకు, జీవితాంతం తనతోనే ఆమె ఉంటుందనే భావనతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. “ఆమె ఒంటరిగా ఉండకూడదు… నేను ఆమెకు తోడుగా ఉంటాను” అన్న భావంతోనే భార్య పక్కనే తన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించినట్లు ఆయన చెప్పారు. జీవిత భాగస్వామి పై నిస్వార్థమైన అనురాగాన్ని చూపిస్తున్న రైతును చూసి అందరూ కంటతడి పెట్టుకున్నారు.చిలుకూరులో జరిగిన ఈ ఘటన, ప్రేమకు వయస్సుతో పని లేదని మరోసారి నిరూపించింది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird