Home Latest News ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి | ప్రజావాణి ద్వితీయ వార్షికోత్సవం| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క| ప్రజావాణి| పొన్నం ప్రభాకర్| జూపల్లి కృష్ణారావు| IAS దివ్య దేవరాజన్| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి | ప్రజావాణి ద్వితీయ వార్షికోత్సవం| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క| ప్రజావాణి| పొన్నం ప్రభాకర్| జూపల్లి కృష్ణారావు| IAS దివ్య దేవరాజన్| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి | ప్రజావాణి ద్వితీయ వార్షికోత్సవం| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క| ప్రజావాణి| పొన్నం ప్రభాకర్| జూపల్లి కృష్ణారావు| IAS దివ్య దేవరాజన్| సీఎం రేవంత్ రెడ్డి


డిసెంబర్ 19, 2025 6:42PMన పోస్ట్ చేయబడింది


ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కరమే లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజావాణి రెండో వార్షికోత్సవం సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతు ఇప్పటివరకు 74 శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్లు. విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నా, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

అధికారానికి దూరమైన విపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. తాము మరింత ముందుకు వెళ్తామన్నారు. పోరాడి వచ్చిన తెలంగాణలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి అందించిన హామీ ఇచ్చారు. ప్రజావాణి విజయవంతం చేసిన చిన్నారెడ్డి, దివ్యాదేవరాజన్‌కు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ ప్రజావాణి కార్యక్రమం నిజమైన ప్రజా పరిపాలనకు ప్రతిరూపమని ఆయన అన్నారు.

దేశంలో ఇంత సమర్థంగా ప్రజా గోడు వినిష్కరిస్తున్న కార్యక్రమం ఎక్కడా లేదని పేర్కొన్నారు.సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాంకేతిక సహకారంతో, రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేయడం మరింత పారదర్శకంగా ప్రజావాణి కొనసాగుతుంది. ప్రజల మేలు కోసం రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థ పనిచేయడం మా ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి ఇన్‌ఛార్జి దివ్యదేవరాజన్ జరిగింది. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల తమ అనుభవాలను పంచుకున్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird