డిసెంబర్ 17, 2025 2:02PMన పోస్ట్ చేయబడింది

ఓ దొంగ పక్కా ప్రణాళికతో దేవాలయంలో దొంగతనం చేయడానికి వచ్చాడు. కానీ అనూహ్యంగా స్థానికుల చేతికి చిక్కి చావుదెబ్బలు తిన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలున్నాయి. హైదరాబాద్ అత్తాపూర్‌లోని పోచమ్మ దేవాలయంలో దొంగతనానికి ఓ యువకుడు యత్నించిన ఘటన కలకలం రేపింది. ఓకుడు రాత్రి సమయంలో అత్తాపూర్‌లోని పోచమ్మ దేవాలయానికి వెళ్ళాడు, అమ్మవారి మెడలో ఉన్న బంగారు చైన్‌తో పాటు వెండి వస్తువులు దొంగిలించి పారిపో తుండగా… అప్పుడే అక్కడికి వచ్చిన పూజారి దొంగను చూశాడు.
దొంగను గమనించిన పూజారి వెంటనే గట్టిగా కేకలు వేయడంతో అప్రమ త్తమైన స్థానికులు ఆలయం వద్దకు చేరుకుని పారిపో తున్న దొంగని పట్టుకున్నారు. అనంతరం అతడిని ఆలయ ప్రాంగణంలో స్తంభానికి తాళ్లతో కట్టేశారు. ఈ ఘటనలో కొందరు స్థానికులు అడిగిన ప్రశ్నలకు ఆ దొంగ డొంకతిరుగుడు సమాధా నాలు చెప్పాడు. దీంతో కొందరు ఆగ్రహంతో దుండగుడిని చావగొట్టారు.
స్థానికులు అందించిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసా గుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల దాడిలో గాయపడిన దొంగను ఆసుపత్రికి.
