Home Latest News యూఎస్‌లో ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐఏ అధ్యక్షుడిగా శీకాంత్ అక్కపల్లి | సీకాంత్ అక్కపల్లి| FIA అధ్యక్షుడు| అమెరికా| అలోక్ కుమార్| జయేష్ పటేల్ – Andhra Waves

యూఎస్‌లో ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐఏ అధ్యక్షుడిగా శీకాంత్ అక్కపల్లి | సీకాంత్ అక్కపల్లి| FIA అధ్యక్షుడు| అమెరికా| అలోక్ కుమార్| జయేష్ పటేల్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
యూఎస్‌లో ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐఏ అధ్యక్షుడిగా శీకాంత్ అక్కపల్లి | సీకాంత్ అక్కపల్లి| FIA అధ్యక్షుడు| అమెరికా| అలోక్ కుమార్| జయేష్ పటేల్


డిసెంబర్ 16, 2025 5:18PMన పోస్ట్ చేయబడింది


అమెరికాలో భారతీయులు.. అందులోనా తెలుగు వారు గొప్ప ఖ్యాతిని గడుపుతున్నారు. అమెరికాలోని అతిపెద్ద భారతీయుల సమూహానికి వచ్చే ఏడాదికి గానూ తెలుగు వ్యాపారవేత్త శ్రీకాంత్ అక్కపల్లి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక ఈ పదవి దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా కూడా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. గత 50 ఏళ్లుగా ఎఫ్ఐఏ అమెరికాలోని భారతీయులకు సేవలు అందిస్తోంది. ఈ సంస్థకు అమెరికన్ కాంగ్రెస్‌లో గుర్తింపు ఉంది. పలు అవార్డులు కూడా ఉన్నాయి.

2026 సంవత్సరానికి సంబంధించి ఎఫ్ఐఏ కొత్త కార్యనిర్వాహక బృందాన్ని ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీకాంత్ అక్కపల్లి 2026 ఎగ్జిక్యూటివ్ టీమ్‌కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన ఎఫ్‌ఐఏ కొత్త అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎఫ్‌ఐఏ స్వతంత్రంగా నియమించిన అక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయ్‌లతో కూడిన ఎన్నికల కమీషన్ 2026 జరిగిన వార్షిక అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియ తర్వాత.. కమీషన్లకు సిఫార్సు ఎఫ్‌ఐఏ బోర్డు ఆమోదం. కొత్తగా ఏర్పడిన 2026 కార్యనిర్వాహక బృందం.. 2026 జనవరి 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తుంది. ఈ ఏడాది ఎఫ్‌ఐఏ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. ఎన్నికల కమిషన్, ఎఫ్‌ఐఏ బోర్డు కలిసి కార్యనిర్వాహక బృందాన్ని క్రమబద్ధీకరించాలని.. ఈ కౌన్సిల్‌ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక ప్రస్తుత ఎఫ్ఐఏ అధ్యక్షుడు సౌరిన్ పారిఖ్ తర్వాత శ్రీకాంత్ అక్కపల్లి ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి రే పటేల్.. జనరల్ సెక్రటరీగా సృష్టి కౌల్ నరుల కొనసాగనున్నారు. రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మీడియా వంటి పలు రంగాల్లో అపార అనుభవం ఉన్న శ్రీకాంత్ అక్కపల్లి.. ఎఫ్‌ఐఏ సంస్థ ప్రాంతీయ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవిని పొందిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

50 ఏళ్లకు పైగా అమెరికాలో సేవలు అందిస్తున్న ఈ ఎఫ్‌ఐఏ స్వచ్ఛంద సంస్థకు కాంగ్రెషనల్ రికార్డ్‌లో గుర్తింపు ఉంది.. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు, రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు కూడా విశేషం.
ఇక ఎఫ్ఐఏ కొత్త అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి.. ఒక బిజినెస్‌మెన్. ఆయన బిజినెస్‌లు అమెరికాలోనే కాకుండా భారత్‌లోనూ విస్తరించి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, మీడియా, ప్రవాస భారతీయ భాగస్వామ్యం వంటి రంగాల్లో ఆయన వ్యాపారాలను విస్తరించారు.

మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ట్రాన్సిట్ టెక్నాలజీ కన్సల్టింగ్, లైఫ్ సైన్సెస్, ఐటీ వంటి, క్లౌడ్ కంప్యూటింగ్, క్రీడా సామగ్రి తయారీ, ప్రీమియం ఫర్నిచర్ డిజైన్ విభిన్న రంగాల్లో ఉన్నాయి. ఇక ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన శ్రీకాంత్ అక్కపల్లి.. తనకు మద్దతు తెలిపిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇది అదృష్టంగా భావిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని తూర్పు తీరంలో ఉన్న 8 రాష్ట్రాల్లో భారతీయ సమాజాన్ని ప్రతిబింబిస్తూ.. 1970లో లాభాపేక్ష లేకుండా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ యూఎస్‌ఏను ఏర్పాటు చేశారు. గత 50 ఏళ్లుగా అమెరికాలో ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird