Home Latest News పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల దందా.. ముగ్గురు యువకుల మృతి | పాత నగరం| మత్తు ఇంజెక్షన్లు| అనస్థీషియా| డ్రగ్ కంట్రోల్|crime news| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల దందా.. ముగ్గురు యువకుల మృతి | పాత నగరం| మత్తు ఇంజెక్షన్లు| అనస్థీషియా| డ్రగ్ కంట్రోల్|crime news| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల దందా.. ముగ్గురు యువకుల మృతి | పాత నగరం| మత్తు ఇంజెక్షన్లు| అనస్థీషియా| డ్రగ్ కంట్రోల్|crime news| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ శివధర్ రెడ్డి


డిసెంబర్ 15, 2025 5:54PMన పోస్ట్ చేయబడింది


పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల అక్రమ దందా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. చాలామంది యువకులు అనస్థీషియా డ్రగ్స్‌ను మత్తుగా వినియో గిస్తున్న ఘటనలు పెరగడంతో పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే అనస్థీషియా మత్తు ఇంజక్షన్లు తీసుకున్న ముగ్గురు యువకులు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా ఏర్పాటు చేశారు. మత్తు ఇంజక్షన్ల ఓవర్‌డోస్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని పోలీసులు స్పష్టం చేశారు.

డబ్బుల కక్కుర్తితో కొందరు డాక్టర్లు అనస్థీషియా మత్తు ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఒక్కో ఇంజక్షన్‌ను వెయ్యి రూపాయల చొప్పున యువకులు కొనుగోలు చేసిన సమాచారం. ఆటో డ్రైవర్లు, విద్యార్థులు ఎక్కువగా ఈ మత్తు ఇంజక్షన్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

ఈ అక్రమ దందా వ్యవహ రాన్ని పోలీసులు నిర్వహించడం చిన ప్రత్యేక ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చింది. మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ పలువురు యువకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్‌లో ఈ మత్తు మందుల నెట్‌వర్క్‌ను ఛేదించారు.ఈ కేసులో ఇప్పటికే అనస్థీషియా డ్రగ్స్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు డాక్టర్లు, నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మత్తు ఇంజక్షన్ల సరఫరా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీలో ఈ దందా జోరుగా సాగుతుందని… మత్తు ఇంజక్షన్ల దందాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఏది ఏమైనప్పటికి ఈ మత్తు ఇంజక్షన్ల అధిక మోతాదులో తీసుకోని ముగ్గురు యువకులు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి…ఈ ఘటనపై సీరియస్ అయినా పోలీసులు డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి… నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird