Home Latest News సవితి తండ్రి చేతిలో… బాలుడి దారుణ హత్య | హైదరాబాద్| చాంద్రాయణగుట్ట| షేక్ మహ్మద్ అజార్| గాంధీ హాస్పిటల్| నేర వార్తలు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు – Andhra Waves

సవితి తండ్రి చేతిలో… బాలుడి దారుణ హత్య | హైదరాబాద్| చాంద్రాయణగుట్ట| షేక్ మహ్మద్ అజార్| గాంధీ హాస్పిటల్| నేర వార్తలు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
సవితి తండ్రి చేతిలో... బాలుడి దారుణ హత్య | హైదరాబాద్| చాంద్రాయణగుట్ట| షేక్ మహ్మద్ అజార్| గాంధీ హాస్పిటల్| నేర వార్తలు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు


డిసెంబర్ 13, 2025 10:10AMన పోస్ట్ చేయబడింది


హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇరుగు పొరుగు పిల్లలతో జరిగిన చిన్నపాటి గొడవ చివరకు ఓ 10 సంవత్సరాల బాలుడి ప్రాణాలు తీసిన విషాదకర ఘటనగా మారింది. స్థానికుల కథనం ప్రకారం, షేక్ మొహమ్మద్ అజహర్ (10) అనే బాలుడు పరిసరాల్లోని పిల్లలతో ఆడుకుంటూ గొడవకు దిగాడు. ఈ “మీ పిల్లలను ఇలాగే పెంచుతారా?” అంటూ ఎవరో వ్యాఖ్యానించడంతో బాలుడి తండ్రి (సవితి తండ్రి) తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

కోపంతో రెచ్చిపోయిన సవతి తండ్రి ఈ నెల 7వ తేదీన అజహర్‌ను రోడ్డుపైకి ఎత్తి బలంగా పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో బాలుడి తలకు తీవ్ర గాయాలు కాగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఇదిలా, మృతుడు అజహర్ కుటుంబం నేపథ్యంలో కూడా చర్చనీయాంశంగా మారింది.

అజహర్ తల్లి ,భర్త ఉండగానే మరో వ్యక్తిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నది. మొదటి భర్తతో కలిగిన సంతానమే అజహర్… రెండో వివాహం చేసుకున్న తర్వాత బాలుడు తల్లి దగ్గర ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే భర్త చేతిలోనే బాలుడు హత్యకు పాల్పడ్డాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చంద్రయ్య ణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird