డిసెంబర్ 12, 2025 5:35PMన పోస్ట్ చేయబడింది

ఫుట్‌బాల్ అభిమానులకు ఈ నెల 13న పండగే పండగ. ఎందుకంటే ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి ఉప్పల్ స్టేడియం వేదిక. అయితే మెస్సీ పాల్గొనే మ్యాచ్‌లో భద్రతాపరమైన లోపాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. క్రీడాకారుడు లియోనల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మ్యాచ్‌లో పాల్గొంటున్న దృష్ట్యా బందోబస్సు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు.
మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ గురువారం పర్యవేక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి. ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. రేవంత్, మెస్సీ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం (ఈ నెల 12) మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఇమేజ్‌ని పెంచే ఈవెంట్ ఇదే అని అన్నారు.శనివారం 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మ్యాచ్ జరుగుతుందని.. మ్యాచ్ సందర్భంగా అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. స్టేడియం దగ్గర పాసులు అమ్మబడవని… ఇప్పటికే ఆన్‌లైన్‌లో పాసులను విక్రయించినట్లు చెప్పారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. మెస్సీకి Z కేటగిరి భద్రత ఏర్పాటు చేశామని.. గ్రీన్ చానెల్ ద్వారా మెస్సీ ప్రయాణం చేస్తారని. మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉంటుందని.. టికెట్లు లేని వారు ఇంట్లో ఉండి టీవీలో చూడాలని నిర్ణయించారు.
మ్యాచ్‌కు వచ్చే వారు మూడు గంటల ముందే స్టేడియంకు చేరుకోవాలని… ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని స్పష్టం చేశారు. మ్యాచ్ కోసం వచ్చే వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించాలని సూచించారు. వ్యక్తిగత వాహనాలు తీసుకురావడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని తెలిపారు.వాహనాల పార్కింగ్ కోసం 34 ప్రాంతాలకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి అందరి సహకారం అవసరమని సీపీ చెప్పారు.
ఎవరైనా అనుమతి లేకుండా మెస్సీని కలవాలి అని ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని. 3000 మంది పోలీసులు మ్యాచ్ కోసం విధుల్లో ఉంటారని. డ్రోన్లు ద్వారా మ్యాచ్‌ను, భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. మఫ్టీలో కూడా అధికారులు ఉంటూ ప్రేక్షకాదరణపై నిఘా పెడతారని. నిషేధిత వస్తువులు లోపలికి తీసుకెళ్లారు. మ్యాచ్ చూడటం కోసం వచ్చే మహిళా ప్రేక్షకుల కోసం షీ టీమ్స్ కూడా ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
