డిసెంబర్ 12, 2025 9:52AMన పోస్ట్ చేయబడింది

పిల్లల్లో కొందరు చదువులో ముందుంటారు. మరి కొంతమంది పిల్లలు చదువులో వెనుకబడి ఉంటారు. అందుకే తల్లిదండ్రులు ట్యూషన్ పెట్టి తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. ఈ అందించేనే ఓ తల్లిదండ్రులు కూడా తమ చిన్నారి బాలుడిని ట్యూషన్ కి పంపించారు. కానీ ట్యూషన్ టీచర్ ఆ బాలుడు పై చేసిన దారుణం . ఈ అమానుష ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ట్యూషన్ టీచర్ చదవడం లేదనే పేరుతో ఏడేళ్ల చిన్నారిపై అనుషంగా దాడి చేసిన ఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో భయభ్రాంతులకు గురిచేసింది..ఓయూ కాలనీకి చెందిన మొదటి తరగతి విద్యార్థినిపై ఐదుగురు పిల్లలు వల్ల తేజ నందన్ రెగ్యులర్‌గా ట్యూషన్‌కు వెళ్లేవాడు. అయితే చదువుపై దృష్టి పెట్టడం లేదన్న కారణంతో ట్యూషన్ టీచర్ శ్రీ మానస ఆగ్రహం చెంది చిన్నారిపై తీవ్ర హింసకు పాల్పడుతున్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చిన్నారి తేజ నందన్ చేతులు, కాళ్లు, ముఖం తదితర భాగాలపై మొత్తం ఎనిమిది చోట్ల అట్లకాడతో కాల్చినట్టు బాలుడు తన తల్లిదండ్రులకు వివరించాడు. బాలుడిపై గాయాలు చూసిన కుటుంబ సభ్యులు ఆవేదనకు గురై వెంటనే ఫిల్మ్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలుని ఆరోగ్యం స్థిరంగా ఉండటం, కాళ్లపై గాయాల కారణంగా నడవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైద్యులు. చిన్నారిపై అట్లకాడతో దాడి చేసిన టీచర్ శ్రీ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
