డిసెంబర్ 11, 2025 2:54PMన పోస్ట్ చేయబడింది

తాజాగా కోటి సంతకాల సేకరణ చేసింది వైసీపీ. జగన్ పాలనికిదో రెఫరెండంగానూ చెప్పుకుంటున్నారు భూమన, రోజా వంటి వైసీపీ జగజ్జంత్రీలు. ఇదంతా ఇలా ఉంటే ఈ పైపై మెరుగులకు మోస పోని… జగన్ లోలోపల ఒక భారీ సర్వే చేయించారట. ఈ సర్వేలో 18 నెలల కూటమిపాలన ఎలా ఉందో ఒక తుల’నాత్మ’క పరిశీల’న చేయించార’ట. ఈ పరిశీలనలో తేలిన వాస్తవ వాలేంటో చూస్తే..
గతంలో కన్నా ఎంతో మెరుగ్గా కూటమి పాలన ఉన్నట్టు చెప్పారట ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలు. తమకు అన్నీ పథకాలు అందుతున్నాయని.. ఫించన్‌లు స్వయంగా బాబే ఇవ్వడం గొప్ప విషయమనీ.. గూగుల్ సంస్థలు రావడంతో పాటు.. ఐటీవల పార్టనర్ సమిట్ ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు సంబంధించిన పెద్దపడలు. జనానికి చేరుతున్నాయనీ చెప్పారట.
మరి పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు ఈ కూటమి కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మీ అభిప్రాయమేంటని అడగ్గా.. అలా ఉంటేనే రాజధానిపూర్తవుతుంది. పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. ఆపై కేంద్రప్రభుత్వంతో ఉన్న సఖ్యత కారణంగా ఇంకా ఎన్నో మంచి పనులు జరుగుతాయి కాబట్టి.. మాకీ ప్రభుత్వమే బాగుందని అన్నారట ఆంధ్రప్రజలు.
ఇక చంద్రబాబు అపార అనుభవం, లోకేష్ యువనాయకత్వం, పవన్ పాపులారిటీ కూటమి ప్రభుత్వానికి పెట్టని కోటలుగా మారి.. ఏపీని సంక్షేమభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తున్నట్టుగానూ చెప్పుకొచ్చారట సర్వేలో పాల్గొన్న ప్రజలు. దీనితో జగన్ కి దిమ్మ తిరిగి భవిష్యత్ బొమ్మ కనిపించిందట. ఆయన అధికారపు ఆశలపై ఫ్రిడ్జ్‌లోంచి బయటకు తీసిన చల్ల చల్లని నీళ్లు కుమ్మరించినట్టయ్యిందట.
బేసిగ్గ జగ’న్ ఇప్పటి వరకూ ఏం భావించాడో చూస్తే.. ఆయనకు ఉన్న 40 శాతం ఓటు బ్యాంకుకు కూటమి వ్యతిరేఖత ద్వారా మరో 8 శాతం ఓటు బ్యాంకు తన పార్టీకి కలిసి వస్తుంది. కాబట్టి, సుమారు 50 శాతం ఓట్లతో తాను 2029లో గెలవబోతున్నట్లుగా ఫీలయ్యేవారట ఇన్నాళ్లూ. ఇప్పుడా ఫీలింగ్స్ మొత్తం బూడిదలో పోసినట్టే అయ్యింద’ట. ఆ సర్వే ఫలితాలు అలా అఘోరించాయట.
ఇలా ఎందుకు జరిగిందో కూపీ లాగిన జగన్ కి నమ్మలేని నిజాలెన్నో బయట పడ్డాయట. మరీ ముఖ్యంగా జగన్ మైండ్ సెట్‌లో ఆల్రెడీ ఉన్న హింసాత్మక ప్రవృత్తికి రప్పా రప్పా ఫ్లెక్సీల మోత కూడా తోడయ్యిందట. అంతే కాదు కొందరు ఫ్యాను పార్టీ మద్దతు దారులు కౌంటింగ్ మొదలయ్యి ఫలితాలు తమ వైపునకు తిరుగుతున్నాయని తెలిసిన వెంటనే న*కుడు మొదలవుతుందని చేస్తోన్న హెచ్చరికలు కూడా ఆయనకు చేటు తెస్తున్నట్టు బయట పడిందట.
.webp)