Home Latest News కడప నగర మేయర్ గా పాక సురేష్ ఏకగ్రీవం | కడప మేయర్‌గా పాక సురేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ycp| 47 డివిజన్ – Andhra Waves

కడప నగర మేయర్ గా పాక సురేష్ ఏకగ్రీవం | కడప మేయర్‌గా పాక సురేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ycp| 47 డివిజన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
కడప నగర మేయర్ గా పాక సురేష్ ఏకగ్రీవం | కడప మేయర్‌గా పాక సురేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ycp| 47 డివిజన్


డిసెంబర్ 11, 2025 12:03PMన పోస్ట్ చేయబడింది


కడప కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేషన్‌లో జరిగిన ఎన్నిక ప్రక్రియలో పాక సురేష్ వినా మరెవరూ పోటీ ఎంపిక ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. గత ఎన్నికల్లో మేయర్ గా గెలిచిన సురేష్ బాబు కుటుంబ సభ్యులు మున్సిపల్ చట్టాలను అతిక్రమించి పనులు చేపట్టారు. ఈ కారణంగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు పొందారని తేలింది. విజిలెన్స్ నివేదికను అనుసరించి సురేష్ బాబును ఈ ఏడాది సెప్టెంబర్ 23న మేయర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగాన్ని ఇన్ చార్జి మేయర్ గా నియమించారు. తాజాగా ఖాళీగా ఉన్న మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కడప కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా గత ఎన్నికల్లో టిడిపి నుంచి ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ గిలిచారు. ఈ రెండు మినహా మిగిలిన 48 డివిజన్లలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడం, కడప ఎమ్మెల్యేగా టిడిపి నుంచి మాధవీ రెడ్డి గెలవడం జరిగింది .ఆ తర్వాత ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు మరణించారు. దీనితో వైసిపి కార్పొరేటర్ల సంఖ్య 38గా ఉంది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వైసిపి అనుకూలంగా ఉండటంతో వారి సంఖ్య 39 . ఆ కడప కార్పొరేషన్ లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది.

సంఖ్యా బలం లేకపోవడంతో గురువారం (డిసెంబర్ 11) జరిగిన మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయలేదు. వైసీపీ నుంచి 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేస్ ను మేయర్ అభ్యర్థి పోటీకి దిగి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా గెలుపొందారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird