డిసెంబర్ 8, 2025 1:46PMన పోస్ట్ చేయబడింది

అసలే గోవా టూరిజం అంతంత మాత్రం. దానికి తోడు ఇలాంటి అగ్నిప్రమాదాలు కూడా తోడవడంతో మరింత తగ్గుముఖం పట్టేలా కనిపిస్తోంది. ఇంత కీ ఈ ఫైర్ యాక్సిడెంట్ డీటైల్స్ ఏంటో చూస్తే.. గోవాలోని బిర్చ్ నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది పాతిక మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అపూర్వ గ్రామంలో నైట్‌క్లబ్ నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘించడం. ఇరుకైన ప్రవేశం మార్గం, తప్పించుకునే దారులు లేకపోవడం, నిర్మాణంలో మండేస్వభావం కలిగిన సామగ్రిని వాడటం వలన ప్రమాదంగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
దీంతో నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాపై బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు స్థానిక పోలీసులు. ఇక ఈ నైట్ క్లబ్‌కు లైసెన్స్ ఇచ్చిన అర్పోరా-నాగోవా సర్పంచ్ రోషన్ రెడ్‌కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలే గోవా పర్యాటకం అంతంత మాత్రం. ఈ సమయంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ఆ కాస్త టూరిజం కూడా పడకేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అసలింతకీ గోవా టూరిజం ఎందుకు తగ్గిందని ఈ సందర్భంగా ఒక పరిశీలిస్తే.. ధరల పెరుగుదల ఒక ప్రధాన కారణంగా చెబు తున్నారు. దానికి తోడు ఇక్కడకొచ్చే టూరిస్టులపై స్థానిక ఆటో, క్యాబ్ మాఫియా ప్రభావం కూడా ఎక్కువ గానే ఉంద’ని అంటారు. ఇక బీచ్‌లలో శుభ్రత లోపించడం, పర్యాటకులతో అనుచిత ప్రవర్తన వెరసీ గోవాకు ప్రత్యామ్నయంగా థాయ్ ల్యాండ్ వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు పర్యాటకులు. గోవాను ప్రస్తుత కాలస్థితులకు అనుగుణంగా పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలం చెందడం కూడా గోపర్యటకుల రాక ప్రధాన కారణంగా తగ్గింది.
ఇక్కడ ఆటో క్యాబ్ మాఫియా ఆగడాలపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉబర్, ఓలా వంటి చౌకైన యాప్‌లు.. అందుబాటులో లేకుండా చేయడం పట్ల కూడా చాలా మంది టూరిస్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక గోవాలో స్థానికుల నిరసన కూడా ఒక కారణంగా చూపుతుంది. పర్యాటకుల వల్ల స్థానిక జీవన శైలి బాగా దెబ్బ తింటోందని.. భూముల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని స్థానికులు అసంతృప్తిగా, ఆగ్రహంగా ఉన్నారు. దీంతో వీరు తరచూ ఆందోళనలకు దిగుతున్నారు.
ఇది కూడా గోవా పట్ల పర్యాటకుల విముఖతకు ఒక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం, గత 10 ఏళ్లలో విదేశీ పర్యాటకుల సంఖ్య దాదాపు 93 శాతం తగ్గింది. అయితే 2025లో దేశ విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కరోనా ముందు కాలంతో పోలిస్తే చాలా చాలా తక్కువకి ముందు గోవా టూరిజం బ్రహ్మాండంగా ఉండేది. కోవిడ్ తర్వాత విదేశీ పర్యాటకం గణనీయంగా పడిపోయింది.
ఆంధ్ర ప్రదేశ్ కూడా అత్యధిక తీర ప్రాంతం గల రాష్ట్రమే. మరి గోవా కి మాత్రమే అంతగా టూరిస్టులు ఎందుకు వస్తారంటే ఇక్కడ నీరెండ ఎక్కువ. అదే ఏపీ సన్ రైజింగ్ స్టేట్ కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువ. దానికి తోడు గోవా స్థానికులు సైతం విదేశీ జీవన శైలిని ఏమంత అభ్యంతర పెట్టరు. నడిరోడ్డుపై శృంగారం మద్య మాంసాదుల సేవనం ఇంకా ఎన్నో విదేశీ లైఫ్ స్టైల్ ని ఇక్కడి ప్రజలు పట్టించుకోరు. అయితే గోవాపై బీజేపీ పట్టు పెరిగాక.. ఇక్కడ తరచూ నిరసనలు ఆందోళనలు పెట్రేగడమే విదేశీ టూరిస్టుల రాకడ గణనీయంగా తగ్గడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు.
ఉన్న సమస్యలు చాలవన్నట్టు ఇలాంటి సిలిండర్ పేలుడు ఘటనలకు సంబంధించిన వార్తలు సైతం గోవా టూరిజాన్ని మరింత దెబ్బ తీసేలా. శనివారం (డిసెంబర్ 6)అర్థరాత్రి ప్రమాదం జరిగినప్పుడు నైట్‌క్లబ్‌లో సుమారు 100 మంది వరకు ఉన్నారని, సిలెండర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మంటలు చెలరేగగానే చుట్టూ గ్రౌండ్ ఫ్లోర్ వైపు పరుగులు తీశాయి, ప్రవేశద్వారం ఇరుకుగా ఉండటంతో కొందరు వంటగదిలోనే చిక్కుకుపోయారని తెలుస్తోంది. మృతుల్లో నలుగురు టూరిస్టులు, 14 మంది సిబ్బంది ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
