డిసెంబర్ 8, 2025 5:48PMన పోస్ట్ చేయబడింది

ఢిల్లీ హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ ఆశ్రయించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లతో ఈ కామర్స్ సంస్థలు తన అనుమతి లేకుండా ఫోటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎన్టీఆర్ పిటిషన్ వేశారు. అనుమతి లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో, పేరు వాడిన వారిపై మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 22కి వాయిదా వేశారు.
ఈ మేరకు పిటిషన్‌ను న్యాయమూర్తి మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా ఇవాళ విచారించారు. ఎన్టీఆర్ ఫిర్యాదులపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 కింద మూడురోజుల్లో చర్యలు తీసుకున్న న్యాయమూర్తి. సోషల్ మీడియా, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పింది. ఆ రోజున సవివరంగా ఉత్తర్వులు జారీ చేయా సింగ్, ప్రీతమ్ అరోరా తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ న్యాయవాది జే సాయి దీపక్ వాదనలు వినిపించారు.
అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను ఉపయోగించడం, ట్రోల్స్ చేయకుండా.. అలాగే, బిజినెస్ అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు గానీ, ఫొటో గానీ ఉపయోగించకుండా కోర్టును ఆశ్రయించారు. గతంలోనూ టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు నాగార్జున, అజయ్ దేవగన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవిశంకర్ సహా పలువురు ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
