Home సినిమా రికార్డు ధరకు ది రాజా సాబ్ ఓటీ రైట్స్‌.. ఎంతో తెలుసా? – Andhra Waves

రికార్డు ధరకు ది రాజా సాబ్ ఓటీ రైట్స్‌.. ఎంతో తెలుసా? – Andhra Waves

by
0 comments
రికార్డు ధరకు ది రాజా సాబ్ ఓటీ రైట్స్‌.. ఎంతో తెలుసా?



పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో మొదట ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘ది రాజా సాబ్’. మారు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ప్రభాస్‌ కెరీర్‌లో తొలిసారిగా హారర్‌ థ్రిల్లర్‌ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిచ్చేందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ఎలా ఉంటుందనేది పక్కన పెట్టేస్తే.. అందరి దృష్టీ ఓటీటీపైనే ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కి ఎంత వస్తుంది అనే దానిపై అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా ఓటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తుందనే వార్తలు గతంలో వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను జియో హాట్‌స్టార్‌ సొంతం చూచుకుందని సూచిస్తుంది.

అన్ని భాషలకు సంబంధించిన ఓటిటి హక్కుల కోసం జియో హాట్‌స్టార్ దాదాపు రూ. 170 కోట్లకు పైగా ఆఫర్‌ చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తున్న ఈ వార్త నిజమే అయితే ఓటీటీ రైట్స్‌కి అత్యధిక రేటు సంపాదించిన సినిమాగా ‘ది రాజా సాబ్’ నిలుస్తుంది. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird