Home Latest News ఉగ్ర చెరలో భువనగిరి యువకుడు | మాలిలో భువనగిరి వ్యక్తి కిడ్నాప్| nov23| తీవ్రవాదులు| తల్లిదండ్రులు – Andhra Waves

ఉగ్ర చెరలో భువనగిరి యువకుడు | మాలిలో భువనగిరి వ్యక్తి కిడ్నాప్| nov23| తీవ్రవాదులు| తల్లిదండ్రులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఉగ్ర చెరలో భువనగిరి యువకుడు | మాలిలో భువనగిరి వ్యక్తి కిడ్నాప్| nov23| తీవ్రవాదులు| తల్లిదండ్రులు


డిసెంబర్ 6, 2025 11:53AMన పోస్ట్ చేయబడింది


దక్షిణాఫ్రికాలోని మాలిలో భువనగిరికి చెందిన ఓ యువకుడిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మాలిలోని కోబ్రీలో రూబీ బోర్ వెల్ సంస్థలో పని చేయడానికి వెళ్లిన భువనగిరి యువకుడు ప్రవీణ్ ను గత నెల 23న జెఎన్‌ఐ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కుమారుడి కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రభుత్వాన్ని కన్నీటితో వేడుకుంటున్నారు.

గత 14 రోజులుగా మాలిలో ఉగ్రవాదుల చెరలో ఉన్న నల్లమాస ప్రవీణ్ ను విడిపించి క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని వేడుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండ సోమరం గ్రామానికి చెందిన నల్లమస ప్రవీణ్ జీవనఉపాధి కోసం ఆఫ్రికా ఖండం మలి రాష్ట్రంలోని ఓ బోర్వెల్ కంపనీ నుంచి నల్లమసు ప్రవీణ్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో మాలీ వెళ్లినప్రవీణ్, గత నెల 23న చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడాడు. అనంతరం అదే రోజు రాత్రి కిడ్నాప్ నకు జరిగింది. అప్పటి నుంచీ ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బోర్ వెల్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. దీంతో ప్రవీణ్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

తమ కుమారుడిని ఉగ్రవా దుల చర నుంచి విడిపించి క్షేమంగా తమ ఇంటికి పంపిం చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రవీణ్ గురించి ఎటువంటి సమాచారం తెలియదని వారు చెప్పారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird