Home Latest News మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది… అధైర్య పడొద్దు : కేసీఆర్ | కేసీఆర్‌ను కలిసిన కొత్త సర్పంచ్‌లు| ఎర్రవల్లి| గజ్వాల్| తెలంగాణ| BRS పార్టీ| కేటీఆర్| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది… అధైర్య పడొద్దు : కేసీఆర్ | కేసీఆర్‌ను కలిసిన కొత్త సర్పంచ్‌లు| ఎర్రవల్లి| గజ్వాల్| తెలంగాణ| BRS పార్టీ| కేటీఆర్| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది... అధైర్య పడొద్దు : కేసీఆర్ | కేసీఆర్‌ను కలిసిన కొత్త సర్పంచ్‌లు| ఎర్రవల్లి| గజ్వాల్| తెలంగాణ| BRS పార్టీ| కేటీఆర్| సీఎం రేవంత్ రెడ్డి


5 డిసెంబర్, 2025 8:46PMన పోస్ట్ చేయబడింది


బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు సభ్యులు కేసీఆర్‌ను ఫాం హౌస్‌లో కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ అన్ని కాలాలు మనకు అనుకులంగా ఉండవు కొన్ని కష్టాలు వస్తాయి. వాటికి కుంగి పోవద్దని తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయి అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని వచ్చేది మన బీఆర్‌ఎస్ ప్రభుత్వమని చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో ఎవరో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను గుర్తుపట్టి పేరున పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితి, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితి, గ్రామస్తులు కేసీఆర్ దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird