Home సినిమా మహేష్‌బాబు సినిమాల వల్లే అఖండ2 రిలీజ్ వాయిదా! – Andhra Waves

మహేష్‌బాబు సినిమాల వల్లే అఖండ2 రిలీజ్ వాయిదా! – Andhra Waves

by
0 comments
మహేష్‌బాబు సినిమాల వల్లే అఖండ2 రిలీజ్ వాయిదా!



– ఆ రెండు సినిమాలే ప్ర‌ధాన కార‌ణం
– నిర్మాతలకు, అభిమానులకు షాక్‌
– ఒకరోజు ఆలస్యానికి కారణం

కొద్ది గంటల్లో ప్రీమియర్స్‌ ద్వారా ‘అఖండ2’ వీక్షించేందుకు నందమూరి ఎంతో ఆసక్తిగా తరుణంలో ఆకస్మికంగా ప్రీమియర్స్‌ రద్దు కావడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్‌ 5న ప్రీమియర్స్‌, డిసెంబర్‌ 6న రెగ్యులర్‌ షోలు చూపించారని. నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరో సినిమా అర్థాంతరంగా వాయిదా పడడం వెనుక కారణాల గురించి రకరకాలుగా చెబుతున్నారు.

ప్రీమియర్స్‌ని రద్దు చేయడం వెనుక టెక్నికల్‌ అంశాలు ఉన్నాయంటూ మొదట వినిపించింది ఆర్థికపరమైనవని తర్వాత తెలిసింది. ఇదిలా ఉంటే.. ‘అఖండ2’ రిలీజ్ వాయిదా పడడం వెనుక మహేష్‌బాబు సినిమాలు ఉన్నాయి. 2014లో మహేష్‌బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘1 నేనొక్కడినే’, మహేష్‌బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ‘ఆగడు’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి.

‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ చిత్రాలను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ భాగస్వామిగా ఉంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలకు ఈ రెండు సినిమాలు నష్టాలను తెచ్చిపెట్టాయి. ఆ సందర్భంలోనే ఈరోస్‌కు 14 రీల్స్‌ సంస్థ 28 కోట్లు బకాయిపడినట్టు తెలుస్తోంది. ఈ చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తున్న 14 రీల్స్‌ సంస్థపై ఈరోస్‌ కోర్టుకెక్కింది. దాని ఫలితంగానే ‘అఖండ2’ చిత్రం వాయిదా పడింది.

సరిగ్గా విడుదల రేపు అనగా మద్రాస్‌ హైకోర్టులో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ పిటిషన్‌ దాఖలు చేయడం, దాన్ని స్వీకరించిన కోర్టు.. ‘అఖండ2’ చిత్రం విడుదల ఆపాలంటూ జారీ చేయడం జరిగింది. దీంతో చిత్ర నిర్మాతలే, సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు కాదు, అభిమానులు సైతం షాక్ అయ్యారు. ఎవరూ ఊహించని ఈ పరిణామం వల్ల ఒక భారీ సినిమా రిలీజ్‌కి అంతరాయం కలిగింది. తాజా అందుతున్న సమాచారం మేరకు ఆర్థిక సంబంధిత లావాదేవీలను 14 రీల్స్‌ పూర్తి చేసిందని, ఇక రిలీజ్‌కి ఎలాంటి ఇబ్బందీ లేదని.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird