Home సినిమా అఖండ2 టికెట్‌ రూ.5 లక్షలు.. ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా? – Andhra Waves

అఖండ2 టికెట్‌ రూ.5 లక్షలు.. ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా? – Andhra Waves

by
0 comments
అఖండ2 టికెట్‌ రూ.5 లక్షలు.. ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా?



ప్రపంచవ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమైన ‘అఖండ2’ డిసెంబర్ 5న ప్రీమియర్స్‌తో ప్రారంభం కానుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా, మరెంతో ఉత్సాహంగా ఈ సినిమా కోసం సిద్ధంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అఖండ తాండవం ప్రారంభం కాబోతోంది. ఈ కోరికనే నందమూరి అభిమానుల సందడి కూడా మొదలైంది.

నందమూరి బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘అఖండ2’ చిత్రం టికెట్‌ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగనన్‌మోహన్‌ రూ.5 లక్షలకు కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు గురజాల జగన్‌మోహన్‌ను కలిసి టికెట్‌ అందించారు. బాలకృష్ణ అభిమానిగా ‘అఖండ2’ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా గురజాల జగన్‌మోహన్‌.

చిత్తూరులో నందమూరి బాలకృష్ణ పేరుతో బస్‌ ప్లాంట్‌ నిర్మించడమే కాకుండా ఇతర సేవా కార్యక్రమాలకు టికెట్‌ ద్వారా లభించిన దానిని వినియోగించనున్నట్టు నందమూరి అభిమానులు చెబుతున్నారు. టికెట్‌ వేలం కార్యక్రమంలో నందమూరి బాలక ష్ణ చిత్తూరు టౌన్‌ అధ్యక్షులు ఎల్‌.డి.నాయుడు, జిల్లా అధ్యక్షుడు మురళినాయుడుతో పాటు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird