Home Latest News శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం | TTD| కార్తీక పూర్ణిమ దీపోత్సవం| ఈఓ అనిల్ కుమార్ సింఘాల్| పనబాక లక్ష్మి| జానకీ దేవి| భాను ప్రకాష్ రెడ్డి| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు – Andhra Waves

శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం | TTD| కార్తీక పూర్ణిమ దీపోత్సవం| ఈఓ అనిల్ కుమార్ సింఘాల్| పనబాక లక్ష్మి| జానకీ దేవి| భాను ప్రకాష్ రెడ్డి| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు – Andhra Waves

by andhra andhrawave
0 comments
శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం | TTD| కార్తీక పూర్ణిమ దీపోత్సవం| ఈఓ అనిల్ కుమార్ సింఘాల్| పనబాక లక్ష్మి| జానకీ దేవి| భాను ప్రకాష్ రెడ్డి| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు


డిసెంబర్ 4, 2025 8:50PMన పోస్ట్ చేయబడింది


తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించారు. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

ఇందులో భాగంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో తొలుత శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవుతున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. వీటిని తదుపరి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణ చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.

ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగధ్వవస్వామి, విశ్వక్సేనులు, యోగధ్వవస్వామి, విశ్వక్సేనులు, రాములవారి మేడ, స్తంభం, పరిమళం, పరిమళం. క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.

శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది.

ఈ కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి,

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకి దేవి, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు ఉన్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird