Home Latest News ఫామ్ తాత్కాలికం.. కోహ్లీ టాలెంట్, టెక్నిక్ శాశ్వతం! | రూపం తాత్కాలికం| కోహ్లి ప్రతిభ| సాంకేతికత| శాశ్వత| ప్రశంసలు| నుండి| ప్రతి – Andhra Waves

ఫామ్ తాత్కాలికం.. కోహ్లీ టాలెంట్, టెక్నిక్ శాశ్వతం! | రూపం తాత్కాలికం| కోహ్లి ప్రతిభ| సాంకేతికత| శాశ్వత| ప్రశంసలు| నుండి| ప్రతి – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఫామ్ తాత్కాలికం.. కోహ్లీ టాలెంట్, టెక్నిక్ శాశ్వతం! | రూపం తాత్కాలికం| కోహ్లి ప్రతిభ| సాంకేతికత| శాశ్వత| ప్రశంసలు| నుండి| ప్రతి


డిసెంబర్ 4, 2025 10:24AMన పోస్ట్ చేయబడింది


విరాట్ కోహ్లీ.. క్రీడలతో సంబంధం ఉన్నవారికీ, లేని వారికీ, అసలామాటకొస్తే అందరికీ చిరపరిచితమైన పేరు. దశాబ్దాలుగా భారత క్రికెట్ వెన్నెముకగా నిలుస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ పరుగుల దాహం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫార్మాట్ ఏదైనా భారత క్రికెట్ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఇండియన్ క్రికెట్ అన్నంతగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు కింగ్ విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కోహ్లీపై ఇటీవల కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడు, ఇక ఆటకు గుడ్ బై చేప్పేయడమే బెటర్ అంటూ కొందరు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ విమర్శలకు, విమర్శకులకూ కోహ్లీ నోటితో కాకుండా బ్యాట్ తో సమాధానం చెప్పారు.

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలోనూ అద్భుత సెంచరీలు సాధించి తనలో ఆట ఇంకా మిగిలే ఉందని చాటాడు. తొలి మ్యాచ్‌లో 135 పరుగులతో చెలరేగిన కోహ్లీ, బుధవారం (డిసెంబర్ 30న జరిగిన రెండో వన్డేలో కూడా శతకబాదాడు. ఈ రెండు మ్యాచ్‌లలో విరాట్ బ్యాటింగ్ చూసిన వారంతా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోహ్లీ లేని క్రికెట్ అంటే శూన్యం అంటున్నారు.

విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా చేశాడు. 35 ఏళ్ల కోహ్లీ ఇప్పటికీ యాక్యురేసీ, యగ్రసివ్ నెస్, ఫిట్ నెస్ విషయంలో కొత్త వారికి ఒక మోడల్‌గా నిలుస్తున్నాడనడంలో సందేహం లేదు. టన్నుల కొద్దీ పరుగులు చేసిన కోహ్లీ ఇప్పటికీ సింగిల్ రన్ కోసం వికెట్ల మధ్య చిరుతను మించిన వేగంతో పరుగెత్తుతాడు. ఆ ఫిట్ నెస్ కొత్త కుర్రాళ్లలో కూడా కనిపించదని మాజీ క్రికెటర్లు అంటున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird