Home Latest News సచివాలయమా? కమర్షియల్ కాంప్లెక్సా.. పోలీసులపై చంద్రబాబు ఫైర్ | బారికేడ్లపై cm కోపం| ప్రశ్న| సెక్రటేరియట్| వాణిజ్య – Andhra Waves

సచివాలయమా? కమర్షియల్ కాంప్లెక్సా.. పోలీసులపై చంద్రబాబు ఫైర్ | బారికేడ్లపై cm కోపం| ప్రశ్న| సెక్రటేరియట్| వాణిజ్య – Andhra Waves

by andhra andhrawave
0 comments
సచివాలయమా? కమర్షియల్ కాంప్లెక్సా.. పోలీసులపై చంద్రబాబు ఫైర్ | బారికేడ్లపై cm కోపం| ప్రశ్న| సెక్రటేరియట్| వాణిజ్య


డిసెంబర్ 3, 2025 3:11PMన పోస్ట్ చేయబడింది


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిత్యం ప్రజలలో ఉంటారు. ప్రజలకూ తనకూ మధ్య బారికేడ్లు అనవసరమని భావించడమే కాదు.. ఆ దిశగా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులు అధికారులుంటారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ జనానికి తనకూ మధ్య పరదాలు కట్టించుకుని వారికి కనిపించకుండా ముఖం చాటేసి తిరిగారు. అయితే తాను పూర్తిగా భిన్నమని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు.

తన పర్యటన సందర్భంగా పరదాలు, బారికేడ్‌లు వంటి వాటికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. పోలీసులు కూడా ఆయన అభిమతానికి తగినట్లేనడుచుకున్నారు. పించన్ల పంపిణీకి ఆయన గ్రామాలకు వెళ్లిన సందర్భాల్లో పోలీసుల ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని చంద్రబాబు ప్రశంసలు కూడా కురిపించారు. అయితే.. పోలీసుల తీరు పూర్తిగా మారలేదని ఆయన తాజాగా గమనించారు. సచివాలయానికి వెళ్లే దారిలో ఆయన నిద్రపోయే సమయంలో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిపైకి వాహనాలు రాకుండా అడ్డుకోవడాన్ని గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ఆపించి అక్కడికక్కడే పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర సచివాలయమా? లేకపోతే కమర్షియల్ కాంప్లెక్సా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయానికి వెళ్లే దారిలో ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రకటనలతో కూడిన బారికేడ్లను వెంటనే తొలగించాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఆ తరువాత ఆర్టీజీఎస్ పాల్గొన్న చంద్రబాబు అక్కడ కూడా బారికేడ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తే చాలన్నారు. రోడ్లను మూసేస్తూ బారికేడ్లు పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరికాదన్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird