డిసెంబర్ 3, 2025 3:38PMన పోస్ట్ చేయబడింది

తెలంగాణలో రెండు టర్మ్‌లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ జరిగింది. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోదీని కోరాని రేవంత్ పేర్కొన్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలా సహకరించాడో ఇప్పుడూ అలాగే సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశాని రేవంత్ రెడ్డి తెలిపారు.
నిన్నటి నా వ్యాఖ్యలపై అనవసర వివాదం గురించి డీసీసీ అధ్యక్షుల సమావేశంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం అని చెప్పే ప్రయత్నం చేశానని రేవంత్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోవడంతో ఈ విషయాన్ని పెద్దదిగా చేసి వివాదం చేస్తోందని ధ్వజమెత్తారు. హిందూ దేవుళ్లు మూడు కోట్ల మంది ఉన్నారని… పలు సారూప్యతలు కలిగిన దేవుళ్లు ఉన్నారని తాను చెప్పానని గుర్తుచేశారు. ఈ విధంగానే కాంగ్రెస్ కూడా హిందూ సమాజం లాంటిదేనని తాను వివరించానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
