Home సినిమా అఖండ2 విషయంలో అలా జరగకూడదని అందరూ కోరుకుంటున్నారు! – Andhra Waves

అఖండ2 విషయంలో అలా జరగకూడదని అందరూ కోరుకుంటున్నారు! – Andhra Waves

by
0 comments
అఖండ2 విషయంలో అలా జరగకూడదని అందరూ కోరుకుంటున్నారు!



గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ2 తాండవం’. ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. డిసెంబర్ 4న ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ కూడా పడుతోంది. సరిగ్గా ఏడాది క్రితం అల్లు అర్జున్, సు’ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప2’ చిత్రం కూడా డిసెంబర్‌ 5నే రిలీజ్ అయింది. ఈ సినిమాకి కూడా డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేశారు. ఆ సందర్భంగా జరిగిన దుర్ఘటన గురించి అందరికీ తెలుసు. ఈ ఘటనలో సంచలనం సృష్టించింది.

గత ఏడాది డిసెంబర్ 5న ‘పుష్ప’ చిత్రం సీక్వెల్‌గా ‘పుష్ప2’ రిలీజ్ అయింది. ఈ డిసెంబర్ 5న ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ2’ రిలీజ్ అవుతోంది. ‘అఖండ2’కి డిసెంబర్ 4న ప్రీమియర్స్‌ వేస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన ఘటన రిపీట్ అవ్వకూడదని, అందరూ సేఫ్‌గా సినిమాను చూసి ఆనందించాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా అభిమానులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

‘పుష్ప2’ ప్రీమియర్‌ సందర్భంగా జరిగిన ఘటనను ఒక హెచ్చరికగా తీసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సినిమా వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల భద్రత విషయంలో థియేటర్ల యాజమాన్యాలు, పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా సూచిస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలంటే అభిమానులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

గత సంవత్సరంగా ‘అఖండ2’ చిత్రం పెరుగుతున్న హైప్‌ను చూస్తున్నాను. సినిమా ఎప్పుడు చూసేద్దామా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో బాగా పెరిగింది. ప్రస్తుతం సినిమాపై ఉన్న బజ్‌ను చూస్తుంటే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ సాధించేలా ఉంది. ‘అఖండ’ చిత్రంతో ప్రభంజనం సృష్టించిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను.. ‘అఖండ2’తో తిరుగులేని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఎంతో ఉత్సాహంతో చెబుతున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird