
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఎన్డీయేకు మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో… ఎన్డీయే కూటమి పార్లమెంట్‌లో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా ఉంది.
అయితే జగన్ కు మాటతప్పడం, మడమ తిప్పడం అలవాటేననీ, బయటకు ఎన్ని కబుర్లు చెప్పినా బీజేపీకి నచ్చని విధంగా ఆయన వ్యవహరించే అవకాశం లేదనీ పరిశీలకులు పలు సందర్భాల్లో చూశారు. వారి విశ్లేషణలకు తగినట్లుగానే జనగ్ డీ లిమిటేషన్ బిల్లుకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారు.
అయితే అలా మద్దతు పలకడానికి ఒక షరతు విధించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ షరతుకు బీజేపీ అంగీకరిస్తేనే లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఉందని అంటున్నాయి.

పార్లమెంటులో రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న దామాషా ప్రాతినిధ్యాన్ని కాపాడాలన్నదే ఆ షరతు అని చెబుతున్నాయి. ఇప్పటికే లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సమీకరణలు కీలకంగా మారిన సమయంలో, ప్రాంతీయ పార్టీల వైఖరికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: అప్పుడు బొద్దింకలకు జై: ఇప్పుడు మోడీకి జైజై.. కన్ఫ్యూజన్ లో జగన్.!
విపక్ష ఇతర పార్టీలు ఈ బిల్లుపై విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో వైసీపీ మద్దతు పలకడానికి ముందుకు రావడం. వైసీపీకి రాజ్యసభలో నలుగురు, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉండటంతో.. వైసీపీ మద్దతు ఎన్డీయేకి కీలకంగా మారింది.

అది పక్కన పెడితే..కేంద్రం ఇప్పటికే ప్రస్తుత దామాషా ప్రాతినిథ్యానికి భంగం కలగకుండా సీట్లను పెంచే ఫార్ములాపై కేంద్రం కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. అందుకే వైసీపీ ఆ షరతు విధించిందనీ, ఒక వేళ కేంద్రం అటువంటి కసరత్తు చేసి ఉండకపోయినా కేంద్రానికి మద్దతుగా నిలబడిందని, గతంలో జరిగిన సంఘటనలను ఉటంకిస్తూ వైసీపీ పరిశీలకులు చెబుతున్నారు.
మీకు నచ్చవచ్చు: కాళ్లు మొక్కబోయిన జగన్.. వద్దన్న మోదీ
ఏపీ రాజకీయాల్లో మోదీ వ్యూహాలు…జగన్ సైలెంట్ స్ట్రాటజీ ఎటువైపు?
[YCP, Support, NDA, Delimitation Bill, Jagan, Condition, TeluguOne]
