.webp)
ఏఐ తో టెక్కీల ఉద్యోగాలపై కత్తి వేళాడుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ టెక్ సంస్థలు తమ తమ సంస్థల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఆ కోవలోకి జర్మనీకి చెందిన దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ ఎస్ఏపీ దాదాపు పది వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి సిద్ధమైంది. ఈ మేరకు ఎస్ఏపీ ఉద్యోగుల ఉద్వాసన ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక అందించింది.
కంపెనీ ప్రతిపాదిస్తున్న పదివేల మంది ఉద్యోగుల ఉద్వాసన సంక్య సంస్థ మెత్తం మేన్ పవన్ లో 9 సమానమని అచనా. ఆ సంస్థ సీఈవో క్రిస్టియన్ క్లైన్ నాయకత్వంలో కంపెనీ తన సాఫ్ట్వేర్ అప్లికేషన్లలో ఏఐ సాంకేతికతను అనుసంధానించే దిశగా అడుగులు వేస్తోంది. ఏఐఐ ఆధారిత పరిష్కారాలకు పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాపార మోడల్‌ను మార్చుకోవడం, ఆ సమయంలో నిర్వహణ అదుపులో ఉంచడం వల్ల ఈ ఉద్యోగుల ఉద్వాసన ప్రతిపాదనకు అవకాశం ఉంది. ఏఐ రంగానికి అవసరమైన పెట్టుబడులు, నిధులను మళ్లించేందుకు ఎస్ఏపీ ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. జూలై నుంచే ఏఐ సంబంధిత బాధ్యతలు మినహా ఇతర విభాగాల్లో కొత్త నియామకాలను నిలిపివేసింది. మరోవైపు ఉన్నత స్థాయి నాయకత్వంలో మార్పులు చోటుచేసుకునేలా, ప్రొడక్ట్ హెడ్, సేల్స్ హెడ్ వంటి కీలక బాధ్యతలు ఉన్న సంస్థ నుంచి వైదొలుగుత సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన తప్పదన్న చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: వోక్స్ వ్యాగన్ లో ఉద్యోగుల తొలగింపు.. ఎంత మందినో తెలుసా?
గడిచిన మూడేళ్ల కాలంలో ఎస్ఏపీ చేపడుతున్న రెండో పెద్ద ఉద్వాసన ఇదే. గతంలో 2024 జనవరిలో ప్రకటించిన తొలగింపుల ద్వారా 9,000 నుండి 10,000 ఉద్యోగాలను సంస్థ తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.10 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, సాధారణంగా వార్షిక ఫలితాల జనవరి చివరిలో ఈ ఉద్వాసన ప్రకటనను అధికారికంగా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాంకేతిక రంగంలో ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో వ్యాపార సంస్థలు తమ వనరులు, సిబ్బంది నిర్మాణాన్ని పునఃసమీక్షిస్తున్న సంగతి విధితమే.
ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ ఏఐ ఆధారిత ఫీచర్లకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీలు తమ బడ్జెట్లను ఆ దిశగా మళ్ళిస్తున్నాయి. ఖర్చుల సాంకేతిక ఆధునీకరణ నియంత్రణ, మెరుగుదల సాధించేందుకు ఉద్యోగుల సంఖ్య తగ్గింపుపై దృష్టి సారిస్తోంది. ఎస్ఏపీ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగాలకు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం పరిశీలకులు నిర్ధారించారు.
జనవరి నాటి వార్షిక ఫలితాల సమయంలో లేదా అంతకుముందే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తారు. రాబోయే రోజుల్లో ఎస్ఏపీ ఏఐ వ్యూహం ఏ విధంగా అమలవుతుంది, వివిధ విభాగాలపై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో దానిపై ఉద్యోగులు, వర్గాల్లో ఉత్కంఠ మార్కెట్.
మీకు నచ్చవచ్చు: వాలంటరీ ఎగ్జిట్: ఉద్యోగుల తొలగింపునకు మైక్రో సాఫ్ట్ ఆఫర్ సరికొత్త వ్యూహం.!
ఉద్యోగులకు యాపిల్ ఉద్వాసనలు.. రెండు నెలల్లో రెండో సారి.!
[SAP employees, layoffs, AI, SAP, Christian Klein, SAPs restructuring, TeluguOne]
