
అగ్రరాజ్యం అమెరికా ఆ బాంబుతో చిగురుటాకుల వణికిపోయింది. అయితే అదేమీ శత్రదేశాలో, ఉగ్రవాదులో ప్రయోగించిన బాంబు కాదు.. అగ్రరాజ్యంలోని అట్లాంటిక్ తీర ప్రాంతంపై ప్రకృతి విసిరిన బాంబ్. అవును అట్లాంటిక్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన ఈ తుపాను పేరే బాంబ్. బాంబ్ సైక్లోన్ అమెరికాఅట్లాంటిక్ తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపింది. బాంబ్ సైక్లోన్ ధాటికి, న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీధులన్నీ వరద నీటితో పొటెత్తుతున్నాయి.
తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో సుమారు 9 లక్షల మంది అంధకారంలో మగ్గుతున్నారు. రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. వేల సంఖ్యలో విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం, జాప్యం ఏర్పడింది.
న్యూజెర్సీలోని హొబుకెన్ ట్రాన్సిట్ రైల్వే ట్రాక్ వరద నీటిలో మునిగిపోగా, స్టోన్ హర్బర్లోకి భారీగా నీరు చేరింది. న్యూయార్క్ నగరం, ఆ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలతో పాటు భద్రతా చర్యలలో భాగంగా వాషింగ్టన్ వంతెనపై ట్రాలీలు, బైకుల రాకపోకలను నిషేధించారు.

ఈ తుపాను ప్రభావం అట్లాంటిక్ తీరంలో పాతిక రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. పాతిక కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో వందేళ్లుగా జరుగుతున్న మేసిస్ థ్యాంక్స్ గివింగ్ డే పరేడ్ బాంబ్ సైక్లోన్ కారణంగా వాయిదా పడింది. వాతావరణ పీడనం 24 గంటల్లోనే అసాధారణ స్థాయిలో పడిపోయిన ప్రక్రియను శాస్త్రవేత్తలు బాంబో జెనిసిస్గా నిర్వహించారు. ఈ ప్రక్రియతో అతివేగంగా ఏర్పడే తుపానులను బాంబ్ సైక్లోన్లుగా పిలుస్తారు.
ఇది కూడా చదవండి: తూర్పు గాలుల ద్రోణి ప్రభావం..ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.!
తుపాను ప్రభావం తగ్గే వరకు వర్షాలు, గాలులు, వరద పరిస్థితులపై వాతావరణ శాఖ సూచనలను అనుసరించి అధికార ప్రజలకు సూచించింది. దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, నిలిచిపోయిన రవాణా సేవలను దశలవారీగా సాధారణ స్థితికి తీసుకురావడానికి విద్యుత్ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

బాంబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోవాలని అధికారులు గుర్తించారు. త్వరలో రాబోయే, విద్యుత్ పునరుద్ధరణ హామీ ఇస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: అత్యంత తీవ్ర తుపానుగా ఆక్వాన్: ఆంధ్రా తీరానికి పెనుముప్పు.!
ఏపీలో ఈ వారమంతా వానలే: తుపాను ముప్పుకూడా ఉంది.!
[Bomb cyclone, Ameria, New York, New Jersey, Floods, Powersupply, Transport, Effected, TeluguOne]
