
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు విదేశీ కరెన్సీ అక్రమ రవాణా గుట్టు రట్టు చేశారు. విదేశాలకు అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని దాదాపు కోటి 56 లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
వివరాలిలా ఉన్నాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు ఎయిర్ ఏషియా విమానం ఎక్కేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అతడిని అడ్డుకుని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడి ట్రాలీ బ్యాగులోని దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో విదేశీ కరెన్సీని దాచిన విషయం బయటపడింది. అతడి వద్ద నుంచి 66 వేల 600 అమెరికా డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విదేశీ కరెన్సీ విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 63 లక్షల 62 వేల రూపాయల అంచనా వేశారు.
.webp)
ఈ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, విమానంలో వేరే సీటులో ప్రయాణిస్తున్న అతని భార్య కూడా ఈ అక్రమ రవాణాలో భాగస్వామిగా ఉన్నట్లు తేలింది. వెంటనే అప్రమత్తమైన డీఆర్ఐ సిబ్బంది ఆమెను కూడా అడ్డుకుని తనిఖీలు చేశారు. ఆమె లగేజీలోనూ అదే సరిగ్గా పద్ధతిలో దుస్తుల మధ్య దాచిన 97 వేల 600 అమెరికా డాలర్లను సూచించింది. వీటి విలువ ఇండియన్ కరెన్సీలో 91.94 లక్షల రూపాయలని అధికారులు తెలిపారు. ఈ భారీ మొత్తానికి సంబంధించి ఎలాంటి చట్టబద్ధమైన బ్యాకైన అనుమతి పత్రాలు లేదా, ఆధారాలు లేదా దంపతుల వద్ద లేకపోవడంతో, కస్టమ్స్ చట్టం ప్రకారం నగదుతో పాటు రవాణాకు ఉపయోగించిన సీజ్ చేసిన డిఆర్ఐ అధికారులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
[Foriegn Currency Seized Shamshabad Airport, DRI Seizure Hyderabad, Foreign Currency Smuggling, RGIA Airport , Kuala Lumpur Flight, TeluguOne]
