
ఇక నేను హీరోగా సినిమాలు చేయను అని సంపూర్ణేష్ బాబు ప్యారడైజ్ ప్రమోషన్స్ లో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ బాధపడ్డారు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ తో హీరోగా థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు.
‘కొబ్బరి మట్ట’.. సంపూర్ణేష్ బాబు నుంచి వచ్చిన కల్ట్ కామెడీ .అభిమానులని, ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన ఈ సెన్సేషనల్ మూవీని మేకర్స్ గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం, నవంబర్ 14న ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. సరిగ్గా 2019లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు టాలీవుడ్‌లో విపరీతంగా ట్రెండ్‌గా మారిన రీ-రిలీజ్ జోరులో భాగంగా, సంపూర్ణేష్ బాబు అభిమానులను అలరించేందుకు కొబ్బరి మట్ట మళ్లీ వెండితెరపైకి రాబోతుండటం విశేషం.
ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు నటించిన ప్రయోగాత్మక పాత్రలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆయన ఏకంగా మూడు విభిన్న తరాలకు చెందిన క్యారక్టర్ లలో కనిపించి నటనతో అదరగొట్టారు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు వంటి మూడు విలక్షణమైన రోల్స్‌లో ఆయన చేసిన కామెడీ టైమింగ్ ఇప్పటికీ యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయి రాజేష్ (స్టీవెన్ శంకర్) కథ, స్క్రీన్ ప్లే మరియు సంభాషణలు అందించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి: గోపిచంద్ ‘సింగ’ ఇంటెన్స్ పోస్టర్ విడుదల: ఇది వాళ్ల పనేనా!

ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం, తనదైన ప్రత్యేకమైన స్పూఫ్ కామెడీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త సంచలనం సృష్టించింది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను పగలబడి నవ్వించేలా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ నాటకీయ కుటుంబ కథ చిత్రంలో సంపూర్ణేష్ బాబు పలికిన డైలాగ్స్ మరియు ఆయన బాడీ లాంగ్వేజ్ థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించాయి.మళ్లీ నవంబర్ 14న కూడా నవ్వుల జడివానలో తడిసి ముద్దవ్వడానికి సిద్ధంగా ఉండండి.
[Kobbari Matta Re Release, Kobbari Matta re release, Sampoornesh Babu movies, Kobbari Matta November 14, Burning Star comedy film, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
