
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విభేదాలు మరోసారి పెచ్చరిల్లాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంజగన్, ఆయన సోదరి ఏపీపీసీసీ ఛీఫ్ షర్మిల మధ్య ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా షర్మిల తన కుమార్తె వివాహ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలు కుటుంబ విభేదాలనూ, మరీ ముఖ్యంగా జగన్ షర్మిల మధ్య వైషమ్యాలనూ మరోసారి తెరమీదకు వచ్చేలా చేశాయి. కూతురి పెళ్లి ఏర్పాట్ల కోసం బెంగళూరులోని కుటుంబ నివాసాన్ని, నంది జగన్ బెంగళూరు ప్యాలెస్ ను వాడుకునేందుకు షర్మిల కోరితే.. అందుకు జగన్ నిర్ద్వంద్వంగా నిరాకరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నిర్ణయానికి వెనుక వ్యక్తిగత విభేదాలే కాకుండా, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. గత కొంతకాలంగా జగన్ పై షర్మిల విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మారిన షర్మిల.. ఏపీసీసీ అధినేత్రి హోదాలో జగన్ పై రాజకీయ విమర్శల తీవ్రత పెరిగింది. ఈ రాజకీయ వైరుధ్యాలు, ఆస్తిపాస్తులు ఏర్పడిన విభేదాల పీక్స్ కుటుంబ వేడుకల విషయంలో కూడా ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే జరిగిన శర్మల కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకకు జగన్ గైర్హాజరయ్యారు.
కుటుంబ వేడుకలు, వివాహాది శుభకార్యాలు వంటి సందర్భాల్లోనూ రాజకీయ, వ్యక్తిగత విభేదాలు అడ్డుపడటం ఇరువురి మధ్య గ్యాప్ ఎంతగా పెరిగిందో అవగతమయ్యేలా చేస్తున్నారు. కుటుంబ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే పలు కోర్టు కేసులు, వివాదాలు దూరంగా కొనసాగుతున్న తరుణంలో, సొంత మేనకోడలి వివాహ వేడుకను బెంగళూరు ప్యాలెస్ ను నిరాకరించడం ద్వారా జగన్ సొంత సోదరిని ఎంత ఉంచుతున్నారో తేటతెల్లం చేసింది.
.webp)
ఈ పరిణామాలు కేవలం వ్యక్తిగత విషయాలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో వైఎస్ కుటుంబ రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదాలా ఉంటే బెంగళూరు ప్యాలెస్ వివాదం విషయంలో ఇటు జగన్ నుంచి కానీ, అటు షర్మిల నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే దీనికి సంబంధించి మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
[Jagan And Sharmila Differences Widened, Sharmilas Daughter, Wedding, Permission Jagan Bengaluru Palace, Reject, YS Family Disputes, Telugu One]
