Home ఆంధ్రప్రదేశ్ Local Elections: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ లో చంద్రబాబు మార్క్..టీడీపీ, వైసీపీ కి తేడా ఇదే! – Andhra Waves

Local Elections: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ లో చంద్రబాబు మార్క్..టీడీపీ, వైసీపీ కి తేడా ఇదే! – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


స్థానిక ఎన్నికలు: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా , రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే ప్రారంభమైంది. ఎక్కడ చూసినా నామినేషన్స్ పర్వం తో ఆంధ్ర ప్రదేశ్ వీధులు కళకళలాడిపోయాయి. అలా మూడు రోజుల పాటు ఈ నామినేషన్స్ పండగ జరిగింది. అయితే మాజీ సీఎం జగన్ , వైసీపీ నేతలను టీడీపీ వాళ్ళు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని , వాళ్ళని బెదిరించి భయపెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు ఉదాహరణగా కడప ఏర్పాటు […]

స్థానిక ఎన్నికలు: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా , రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే ప్రారంభమైంది. ఎక్కడ చూసినా నామినేషన్స్ పర్వం తో ఆంధ్ర ప్రదేశ్ వీధులు కళకళలాడిపోయాయి. అలా మూడు రోజుల పాటు ఈ నామినేషన్స్ పండగ జరిగింది. అయితే మాజీ సీఎం జగన్ , వైసీపీ నేతలను టీడీపీ వాళ్ళు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని , వాళ్ళని బెదిరించి భయపెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు ఉదాహరణగా కడపలో కొన్ని కూటమి మున్సిపాలిటీలను తీసుకొచ్చి , రాష్ట్ర వ్యాప్తంగా నాయకులూ మా అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నట్టు మీడియా ముందుకు చెప్పుకొచ్చాడు.

అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదు. నిన్నటితో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల సంఘం అందించిన లెక్కల ప్రకారం చూస్తే తెలుగు దేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 8774 నామినేషన్ వేయగా, వైసీపీ పార్టీ 8129 నామినేషన్లు వేసింది. ఇక జనసేన పార్టీ అయితే కేవలం 1526 నామినేషన్లు వేసినట్లు సమాచారం. ఇతర పార్టీలు , స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు దాదాపుగా 4500 వరకు ఉంటుంది. జగన్ చెప్పినట్టు ఒకవేళ టీడీపీ వాళ్ళు వైసీపీ ని నామినేషన్స్ వేయకుండా అడ్డుకుంటే 8 వేలకు పైగా నామినేషన్స్ కౌంట్ ఎందుకు వచ్చింది?. వైసీపీ ప్రభుత్వం లో టీడీపీ , జనసేన లకు కనీసం నామినేషన్లు కూడా వేయించలేదు. కానీ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం కూటమి వెళ్ళింది. చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ కి ఇదే నిదర్శనం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ సీఎం చంద్రబాబు వైసీపీ అభ్యర్థుల నామినేషన్స్ ని పవర్ ని ఉపయోగించి అడ్డుకోవాలని చూస్తుంటే , ఇన్ని వేల నామినేషన్స్ వచ్చేవి కాదని , జగన్ సానుభూతి కోసం మీడియా ముందుకొచ్చి డ్రామాలు చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

లేకపోతే ఈ నెల 21 నుంచి 23 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు జరగనున్నాయి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ని నేడు ఉదయమే విడుదల చేశారు. అక్టోబర్ 24 న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 25 న తిరస్కరణలపై అప్పీళ్లు చేసుకోవచ్చట , అక్టోబర్ 26 న అప్పీళ్ల పై ఎలక్షన్ కమీషన్ నిర్ణయం తీసుకుంటుంది . అక్టోబర్ 27 న నామినేషన్ల ఉపసంహరణ ని పరిశీలించి తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారట. నవంబర్ 3న పోలింగ్ జరగబోతుంది. నవంబర్ 4 న అవసరమైన చోట రీ పోలింగ్ ని కూడా నిర్వహించారట. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేసి వెల్లడిస్తారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 9983 ఎంపీటీసీ స్థానాలు , 661 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. నగర ఎన్నికలే ఈ స్థాయిలో ఉంటే, ఇక పల్లె ఎన్నికలు ఏ స్థాయిలో ఉంటాయో మీరే ఊహించుకోండి.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird