Home ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ప్రమీలమ్మకు అండ.. సౌభాగ్యమ్మకు గుది – Andhra Waves

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: ప్రమీలమ్మకు అండ.. సౌభాగ్యమ్మకు గుది – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: పులివెందుల.. వయసుకు కుటుంబానికి కంచుకోటగా భావించే ప్రాంతం. ఇక్కడి రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రత్యేకమైన చర్చకు దారితీస్తూ ఉంటాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి వైఎస్ కుటుంబ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా వైఎస్ మనోహర్ రెడ్డి భార్య ప్రమీలమ్మ పేరును ఖరారు చేశారు. దీంతో స్థానిక రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. అభ్యర్థి […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: పులివెందుల.. వయసుకు కుటుంబానికి కంచుకోటగా భావించే ప్రాంతం. ఇక్కడి రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రత్యేకమైన చర్చకు దారితీస్తూ ఉంటాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి వైఎస్ కుటుంబ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా వైఎస్ మనోహర్ రెడ్డి భార్య ప్రమీలమ్మ పేరును ఖరారు చేశారు. దీంతో స్థానిక రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది.

ఎంపిక అనేది వైసిపి అంతర్గత అభ్యర్థి నిర్ణయం కావచ్చు. కానీ ఎన్నికల్లో గెలుపు కోసం స్థానిక సమీకరణలను కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. వైయస్ కుటుంబంలో తాజాగా సాగుతున్న పరిణామాలు మరోసారి తెరమీదకి వచ్చాయి. ముఖ్యంగా రెండు కుటుంబాల మహిళల విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి మీద ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఒక పిన్నికి ఒక విధంగా.. మరొక పిన్నికి ఇంకో

ప్రమీలమ్మకు రాజకీయంగా అవకాశం కల్పించడంపై చర్చ జరుగుతున్న వేళ.. మాజీమంత్రి వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ.. కుమార్తె సునీత రెడ్డి వ్యవహారం ప్రస్తావనకు వస్తోంది. ఒకవైపు వైయస్ కుటుంబానికి చెందిన మహిళకు రాజకీయ అవకాశాలు లభిస్తుంటే.. మరో వైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం కోసం ఆయన భార్య.. కుమార్తె చేస్తున్న పోరాటం గుర్తుకు వస్తోంది. మనోహర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడం జగన్ తీసుకున్న నిర్ణయం. అయితే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి కుటుంబంతో ఉన్న విభేదాలు.. వారి న్యాయపోరాట విషయంలో జగన్ వైఖరి ఏమిటి అనేది కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. ఒకరికి రాజకీయ అవకాశం కల్పించే విషయంలో ముందడుగు వేస్తున్న నాయకత్వం . మరో కుటుంబం సమస్యల విషయంలో ఎందుకు అదే స్థాయిలో నిలవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయాలలో అత్యంత చర్చకు దారి తీసింది. ఈ కేసులో న్యాయం కోసం ఆయన కుమార్తె సునీత రెడ్డి చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. తన తండ్రి హత్య వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి రావాలని.. దోషులకు శిక్ష పడాలని ఆమె న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. వివేక భార్య సౌభాగ్యమ్మ కూడా తన కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

పులివెందులలో వైయస్ కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగే ప్రతి రాజకీయ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తుంది. అలాంటి చోట మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రమీలమ్మ పేరు తెరపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్య సంతరించుకుంది. అయితే ఈ నిర్ణయం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది స్థానిక రాజకీయ సమీకరణలు.. ప్రజల స్పందన.. పాతికేళ్ల ప్రచారం మీద ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో వివేకానంద రెడ్డి కుటుంబం న్యాయం కోసం చేస్తున్న పోరాటం కూడా రాజకీయంగా చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

ప్రమీలమ్మకు రాజకీయ అవకాశం కల్పించడంలో తప్పేమీ లేదనే వాదన ఒకవైపు ఉండొచ్చు. కానీ అదే సమయంలో వివేకానంద రెడ్డి కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా ప్రజలు గుర్తుకు తెచ్చుకునే అవకాశం ఉంది. రాజకీయ పదవులు పంపకం ఒక అంశం.. కుటుంబ సంబంధాలు.. న్యాయం కోసం జరుగుతున్న పోరాటం మరొక అంశం.. ఒక పిన్నికి రాజకీయ పీఠం దక్కుతున్న వేళ.. మరో పిన్ని న్యాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.. ఈ ప్రశ్నకు జగన్ ఏం సమాధానం చెబుతారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird