Home Latest News అమెరికా, భారత్ బంధం.. వ్యూహాత్మక సమీకరణాలు! | అమెరికా మరియు భారతదేశ బంధం | వ్యూహాత్మక | సమీకరణాలు | USIndia సంబంధాలు | మార్కోరూబిన్ | IndiaVisit | ట్రంప్ విదేశీ విధానం | చైనా తైవాన్ ఇష్యూ – Andhra Waves

అమెరికా, భారత్ బంధం.. వ్యూహాత్మక సమీకరణాలు! | అమెరికా మరియు భారతదేశ బంధం | వ్యూహాత్మక | సమీకరణాలు | USIndia సంబంధాలు | మార్కోరూబిన్ | IndiaVisit | ట్రంప్ విదేశీ విధానం | చైనా తైవాన్ ఇష్యూ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ప్రపంచ భౌగోళిక రాజకీయ చిత్రపటంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో, అమెరికా, ఇండియా మధ్య బంధం ఒక కీలక మలుపు తిరిగింది. డొనాల్డ్ ట్రంప్ నకిలీని అమెరికా అమలు చేస్తున్న సరికొత్త లావాదేవీల విధానాలు చైనా చుట్టూ తిరిగే అంతర్జాతీయ సమీకరణలు, తైవాన్ సంక్షోభం వంటి అంశాలు ఇరు దేశాల దౌత్యాన్ని శాసిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అమెరికా ఉన్నతాధికారి మార్కో రూబియో ఇండియాలో ఇవ్వడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ పర్యటన వెనుక ఉన్న అసలు లక్ష్యాలు, ద్వైపాక్షిక సంబంధాల లోతుపాతులు, ఇంధన రంగంలో తలెత్తుతున్న సవాళ్లపై భిన్నమైన విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. వాషింగ్టన్ విధాన నిర్ణేతలకు భారతదేశ అంతర్గత సున్నితత్వాలపై సరైన అవగాహన లేకపోవడం ఇరు దేశాల బంధానికి ఒక పెద్ద అడ్డంకిగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కో రూబియో ఇండియా పర్యటనలో ఒక చరిత్రాత్మక మైలురాయిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అమెరికా అంతర్గత రాజకీయ వర్గాలలో దీనికి ప్రాధాన్యత లభించిన అంతంత మాత్రమే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ పర్యటన కేవలం భారతీయ ప్రజానీకాన్ని ఆకట్టుకోవడానికి ఉద్దేశించిన ఒక ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది తప్ప.. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక రక్షణ, వ్యూహాత్మక ఒప్పందాలకు పునాది వేయలేకపోయిందని అంటున్నారు. అమెరికా విదేశాంగ శాఖలో పనిచేసే అధికారులకు భారతదేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ఉన్న మిడిమిడి జ్ఞానమే ఇందుకు ప్రధాన కారణం. ఉన్నత స్థాయి పర్యటనలు కేవలం ప్రసిద్ధ ప్రదేశాల సందర్శనలు, ఫోటోలకు పోజులు ఇవ్వడం. ప్రజా బాహుళ్యంలో ప్రసంగాలు చేయడానికే పరిమితమైతే.. దాని వల్ల ఆశించిన దౌత్యపరమైన ప్రయోజనాలు సిద్ధించవు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రజల మద్దతు ఎంత ముఖ్యమో.. అంతకంటే మిన్నగా రక్షణ రంగానికి సంబంధించిన స్పష్టమైన హామీలు, ఆర్థిక సహకారం అంతే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అమెరికా రాజకీయ. విద్యాసంబంధిత రంగాలలో చైనాపై ఉన్న పరిశోధనలు, అధ్యయనాలు భారతదేశంపై లేకపోవడం ఒక దీర్ఘకాలిక లోపంగా ఉంది. బీజింగ్ వ్యూహాలను అంచనా వేయడానికి వాషింగ్టన్‌లో ఉన్న బలమైన మౌలిక వనరులు, విశ్లేషణాత్మక విభాగాలు ఢిల్లీ విషయంలో చాలా బలహీనంగా ఉన్నాయి. ఈ అవగాహన రాహిత్యం కారణంగానే, అంతర్జాతీయ వేదికలపై భారతదేశం అసలు అవసరాలు ఏమిటి, భారత్ వేదికకు ప్రాధాన్యత ఇస్తుంది, ఏ ప్రతిపాదనలను తిరస్కరిస్తుంది అనే విషయాలపై అమెరికాకు స్పష్టత వచ్చింది.

కేవలం రిక్షాలపై అమెరికా జెండాలు ప్రదర్శించడం, స్థానిక సాంప్రదాయాలను అనుకరించడం వల్ల తాత్కాలికంగా ప్రజలను ఆకర్షించేమో కానీ.. రెండు దేశాల మధ్య ఒక గంభీరమైన వ్యూహాత్మక నమ్మకాన్ని పాదుగొల్పడం సాధ్యం కాదు. ఇండియా సంస్కృతి, చరిత్ర, ఇక్కడి రాజకీయ పరిస్థితులపై లోతైన అధ్యయనం లేనంత కాలం అమెరికా దౌత్యం కేవలం ప్రాంతంలోనే ఉండిపోతుంది. ప్రస్తుత తరుణంలో ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత అనేది అత్యంత ఆకర్షణీయమైన చర్చనీయాంశంగా మారింది. హోర్ముజ్ సంధిలో ఎదురవుతున్న భద్రతాపరమైన ఇబ్బందులు, అంతర్జాతీయ చమురు సరఫరాలో వస్తున్న ఒడిదుడుకులు, అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు తగ్గడం వంటి పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయితే.. అమెరికా ఈ సంక్షోభాన్ని భారతదేశానికి ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రత్యామ్నాయాన్ని అందించే అవకాశం చూడకుండా, కేవలం తాత్కాలిక నివారణ చర్యగానే పరిగణిస్తోంది.

ఇక్కడ మరో ముఖ్యమైన అంశం, భారతదేశానికి అత్యధికంగా ముడి చమురు అవసరం కాగా.. అమెరికా మార్కెట్ నుండి ఎక్కువగా శుద్ధి చేసిన పెలియం ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అవుతాయి. ఈ రెండు మార్కెట్ల స్వభావాలు వేరుగా ఉండటం వల్ల, అమెరికా ఎప్పటికీ భారతదేశానికి తక్షణ చమురు సరఫరాదారుగా మారలేదు. ఈ వాణిజ్యపరమైన సూక్ష్మ వ్యత్యాసాన్ని వాషింగ్టన్ పాలకులు ఇంకా గుర్తించకపోవడం. మరోవైపు, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా అనుసరిస్తున్న తైవాన్ విధానంపై అస్పష్టత ప్రదర్శన. ట్రంప్ చైనా పర్యటనల నేపథ్యంలో, వాషింగ్టన్ తైవాన్ రక్షణ బాధ్యతల నుండి తప్పుకుందనే ప్రచారం అంతర్జాతీయ మీడియాలో ఊపందుకుంది. అయితే, అమెరికా అధ్యక్షుడు తైవాన్ భద్రతను పూర్తిగా విస్మరిస్తున్నట్లు ఎక్కడా అధికారిక ప్రకటనలు చేయలేదు. దీని వెనుక అసలు వ్యూహం విలువజజ తైవాన్‌పై ఒత్తిడి తెచ్చి ఎక్కువగా అమెరికన్ ఆయుధాలను కొనుగోలు చేయడం ద్వారా వాణిజ్యపరమైన లబ్ధి పొందడమే. ఈ పరిణామాల మధ్య తైవాన్ కూడా చేతులు కట్టుకుని కూర్చోవడం లేదు; అది తన సొంత రక్షణ సామర్థ్యాలను పెంచుకుంటూనే.. అమెరికా ఇచ్చే వ్యూహాత్మక మద్దతుపై ఆధారపడుతోంది.

అందువల్ల, అమెరికా తైవాన్‌ను పూర్తిగా వదిలేసిందని భావించడం కంటే, తన పాత వ్యూహాత్మక అస్పష్టతను మరింత కాలం కొనసాగిస్తోందని అనుకోవడం సమంజసం. డోనాల్డ్ ట్రంప్ విదేశాంగ ప్రదర్శన, అందులో ఎటువంటి నిర్దిష్ట సిద్ధాంతాలు లేదా ఆదర్శాలకు తావుండదు; ఆయన కేవలం లావాదేవీల (గివ్ అండ్ టేక్) ప్రాతిపదికన మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. చైనా పట్ల ఆయన కఠినంగా ఉంటారా లేక మృదు వైఖరి అవలంబిస్తారా అనేది పూర్తిగా ఆయా సమయాల్లో జరిగే వ్యాపార లబ్ధిపైనే ఆధారపడి ఉంటుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఏకైక నినాదమే ఆయన విదేశీ వ్యవహారాలను నిర్దేశిస్తుంది. అందువల్ల.. చైనా, ఇండియా, తైవాన్, రష్యా చమురు సంక్షోభం, దృష్టి క్వాడ్ కూటమి వంటి అంశాలన్నీ ఆయనలో శాశ్వత మిత్రులు లేదా శత్రువులు కావు. అవన్నీ కేవలం అమెరికా ప్రయోజనాల కోసం మార్చి మార్చి ఉపయోగించే రాజకీయ పరికరాలు మాత్రమే. ఈ రకమైన అస్థిరమైన వైఖరి అంతర్జాతీయ సమాజానికి కొంత గందరగోళాన్ని కలిగించింది.. ట్రంప్ శైలిలో ఇదొక సాధారణం. అలాగే స్థిరమైన లక్షణం.

ఈ మొత్తం సమీకరణలో నాలుగు దేశాల క్వాడ్ కూటమి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. చైనా ఆర్థిక, సైనిక విస్తరణను అడ్డుకోవాలనే లక్ష్యంతో భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాలు చేతులు కలిపినప్పటికీ.. ఈ దేశాల అంతర్గత ప్రయోజనాలు. ప్రాధాన్యతలు పూర్తిగా ఉన్నాయి. ఇది ఒక శాశ్వత సైనిక కూటమి కాదు.. సమకాలీన అవసరాల కోసం ఏర్పడిన ఒక తాత్కాలిక వేదిక మాత్రమే. చైనా పట్ల అమెరికా తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, మార్పు, క్వాడ్ సభ్య దేశాల మధ్య ఉన్న పరస్పర నమ్మకాన్ని ప్రభావితం చేస్తుంది. ఇండియాకి క్వాడ్ అనేది కేవలం ఒక రక్షణ వేదిక మాత్రమే కాదు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకోవడానికి ఒక రాజనీతి సాధనం. ఈ పరిస్థితుల్లో, అమెరికా-భారత్ బంధం మరింత బలోపేతం కావాలంటే.. కేవలం ప్రచారాలు, ప్రజా దౌత్యం సరిపోదు. వాస్తవ విధానాలలో, క్షేత్రస్థాయి వ్యూహాలలో సమన్వయం పెరగడం అవసరం. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయనేది ఇరు దేశాల దౌత్య నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత తరుణంలో అమెరికా భారతదేశాన్ని ఒక అనివార్యమైన భాగస్వామిగా గుర్తిస్తున్నప్పటికీ, ఆ గుర్తింపులో డెప్ట్ లోపించింది. మార్కో రూబియో పర్యటన, ఇంధన మార్కెట్లలో అమెరికా వస్తున్న సవాళ్లు, తైవాన్ సరిహద్దు వివాదాలు, మరియు చైన ల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ వంటి అంశాలన్నీ ఇండియాను అంతర్జాతీయంగా ఒక నిర్ణయాత్మకమైన స్థానంలో నిలబెట్టాయి. వాషింగ్టన్ ఇకనైనా భారతదేశాన్ని కేవలం తమ ఉత్పత్తులను అమ్ముకునే ఒక పెద్ద మార్కెట్‌గా మాత్రమే చూడటం మానేయాలి. దానికి బదులుగా, ప్రపంచ రాజకీయాలను శాసించగల ఒక స్వతంత్ర. సార్వభమాధికార వ్యూహాత్మక శక్తిగా భారతదేశాన్ని గుర్తించి, గౌరవించినప్పుడే ఈ ద్వైపాక్షిక సంబంధాలు సుదీర్ఘకాలం మనుగడ సాగిస్తాయి.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చితే, దయచేసి https://www.teluguone.com పోర్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. భాగస్వామ్యం చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird