సినీ గ్లామర్ ప్రపంచంలో పెళ్లి, రిలేషన్‌షిప్‌లు నటిమణుల కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఎంతోమంది నటిమణులు వివాహం తర్వాత అవకాశాలు కోల్పోతామని ఓపెన్ గానే ఉంటారు. తాజాగా ఈ సున్నితమైన అంశంపై ప్రముఖ తెలుగు యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.
స్రవంతి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో ఆమె మాట్లాడుతు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక భారీ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇచ్చాను. నటన, లుక్స్ ఎక్స్ ప్రెషన్స్ పరంగా అద్భుతంగా రాణించాను. మేకర్స్ అనుకున్న క్యారక్టర్ కి వంద శాతం కరెక్ట్ గా సరిపోతానని మేకర్స్ నన్ను ఫిక్స్ కూడా చేశారు.
కానీ ఆ తర్వాత ‘మీకు పెళ్లైందా అని అడిగారు. దాంతో ‘అవును, నాకు పెళ్లైంది’ అని చెప్పాను. అంతే, ఆ ఒక్క సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అంతవరకు ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన మేకర్స్ ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి. కొద్దిసేపట్లో కాల్ చేసి అప్డేట్ ఇస్తామని చెప్పి పంపించారు. ఆ విధంగా పెళ్లి అయిందనే ఒకే ఒక్క కారణంతో ఆ పెద్ద ప్రాజెక్ట్ నుంచి నన్ను తప్పించారని స్రవంతి చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: మెగా 158: ప్రముఖ చారిత్రాత్మక కాలేజీలో మెగా 158 షూటింగ్.. కాలేజ్ ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు.
చిన్న స్థాయి నుంచి ఎదిగిన స్రవంతి, యాంకర్ గా మారి అల్లు అర్జున్ వంటి స్టార్ల నుంచి ప్రశంసలు అందుకున్నారు. బిగ్ బాస్ షోలో కంటెంట్‌గా పాల్గొని తనకంటూ ఒక ఇమేజ్‌ని ఏర్పాటు చేసుకుంది ప్రస్తుతం సినిమా ఆడియో లాంచ్‌లు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలకి హోస్ట్‌గా యాక్టూ ఫుల్ రికార్డ్ ఉంది. మరో వైపు నటిగా కూడా తన సత్తా కొనసాగిస్తూ హే బలవంత్ లో వేశ్య క్యారక్టర్ లో అత్యద్భుతంగా స్క్రీన్ ప్రెజెన్స్ చేసింది.
