జైపూర్ వేదికగా మంగళవారం (మే20) రాత్రి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ.. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో ఐదు బంతులు మిగిలుండగానే సునాయాసంగా ఛేదించింది. సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌కు తో యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ బాధ్యతాయుత బ్యాటింగ్ తోడవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో ఘన విజయం సాధించాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ఉఫ్ మని ఊదేసింది. వైభవ్ సూర్యవంశీ 93 పరుగులతో చెలరేగగా, ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీతో రాణించి ఆర్ఆర్ కు 7 వికెట్ల విజయాన్ని అందించారు.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కు మిచెల్ మార్ష్ 57 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 96, జోష్ ఇంగ్లీషు 60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆ తరువాత రిషభ్ పంత్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 పరుగులతో రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యశ్‌రాజ్ పుంజా రెండు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఇక 221 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే అటాకింగ్ మొదలెట్టింది. జైశ్వాల్ 23 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ తో 43 పరుగులు చేసి ఔటయ్యారు. ధృవ్ జురేల్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 నాటౌట్ బాధ్యతాయుతంగా ఆడాడు. ఇక వైభవ్ సూర్యవంశి అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి ఫోర్లు, సిక్సర్లతో లక్నో బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేసి జట్టుకు ఒంటి చేత్తో విజయానందించాడు. ఈ విజయంతో రాజస్థాన్ తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
.webp)