హైదరాబాదు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణం మరియు చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో ట్రాఫిక్ సమ స్యలను తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ నిర్మాణం కారణంగా చెట్ల నరికివేత జరుగుతుందన్న ఆందోళన పర్యావరణ కార్యకర్తల్లో మొదలైంది. దీంతో వారంద రూ కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు తాత్కాలికంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్ఆర్డీపీలో భాగంగా కేబీఆర్ పార్కు చెట్టు ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారం భించింది… అయితే కేబీఆర్ పార్కు చెట్టు ఉన్న పచ్చ దనం హైదరాబాద్ నగరానికి ల్యాంగ్స్ ఆఫ్ సిటీలో అలాంటి ప్రాంతంలో భారీ నిర్మాణం కారణంగా వందలాది చెట్లను తొలగించే ప్రమాదం ఉందని పర్యావరణ కార్యకర్తలు ఆశ్రయించారు.
దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో వాద ప్రతి వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణతను తగ్గిస్తుందని, హైకోర్టు సెలవులను అదునుగా తీసుకుని చెట్లు నరికివేస్తుందని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు.. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్కు 35 మీటర్ల పరిధిలోని చెట్లను నరక వద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచార ణను జులై 27 వాయిదా వేసింది. తదుపరి 25 నుండి 30 మీటర్ల విచారణ వరకు ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ఈ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు కొన్ని భాగాల్లో తాత్కాలికంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.. కె.బి.ఆర్ పార్క్ అనేది హైదరాబాద్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యావరణ కవచంలా పనిచేస్తుంది. అక్కడి పచ్చదనం వాయు కాలు ష్యాన్ని తగ్గించడమే కాకుండా వేలాది మందికి ఉదయం వాకింగ్ జాగింగ్ కోసం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. అలాంటి ప్రాంతం చెట్టు భారీ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగడం వల్ల చెట్లు నష్టపోతామని, వాతావరణ కాలుష్యం కూడా పెరిగిపోతుందని పర్యావరణ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
