Home Latest News కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు ​​| ఫార్ములా ecar రేసు | acb | కోర్టు | సమన్లు ​​| ktr | అరవింద్కుమార్ – Andhra Waves

కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి ఏసీబీ కోర్టు సమన్లు ​​| ఫార్ములా ecar రేసు | acb | కోర్టు | సమన్లు ​​| ktr | అరవింద్కుమార్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం సంభవించింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాఖలు చేసిన అభియోగపత్రాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుని ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు సమన్లు ​​జారీ చేసింది. ఆయనతో పాటు ఏ2 అరవింద్ కుమార్, ఏ3 బి ఎల్ ఎన్ రెడ్డి లకు కూడా ఏసీబీ కోర్టు జూలై 31న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు ​​జారీ చేసింది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్టు కూడా విచారణను స్వీకరించింది. 2023లో హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫార్ములా ఈ కార్ల నిర్వహణలో ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలతో కేసుకు ప్రాధాన్యత సంతరించుకుంది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఖాతా నుంచి సుమారు రూ.55 కోట్లను ఈ ఫార్ములా ఆపరేషన్స్ సంస్థకు బదిలీ చేసినట్లు ఏసీబీ చార్జ్‌షీట్‌లో గుర్తించబడింది. ఈ నిధుల బదిలీపై అనుమానాలు వ్యక్తం కావడంతో కేసు నమోదు అయింది.

ఈ కేసులో ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావు , ఏ5గా ఎఫ్‌ఈఓ సంస్థను కూడా అభియోగుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి సహా ఎఫ్‌ఈఓ ప్రతినిధులను ఏసీబీ అధికారులు విచారించారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird