కొన్ని సార్లు రావడం లేటు అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అనే రీతిలో ఈ రోజు టాలీవుడ్ ట్రెండింగ్ లో ఉన్న వార్తలు సరికొత్తగా ముస్తాబై వచ్చాయి. మరి ఆ తాజా న్యూస్ ఏంటో చూసేద్దాం
1 . చంద్రబోస్ ఇంట్లో విషాదం
గీత ర చయిత చంద్రబోస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రాజేంద్ర ఎపిలోని కలిగిరిలో గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా జరిగింది. అనంతరం సమీపంలోని హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాజేంద్ర మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు చంద్రబోస్‌కు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
2 . తన సినిమాకి తనే డైరెక్టర్.. రామ్ కొత్త నిర్ణయం!
ఎనర్జిటిక్ స్టార్‌గా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ పోతినేనికి కొంత కాలంగా సక్సెస్ అనేది లేకుండా పోయింది. దీనితో తనకు సరిపోయే కథను తనే సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలుస్తుంది. తను రెడీ చేసిన కథతో మరో దర్శకుడితో సినిమా చెయ్యాలని మొదట అనుకున్నప్పటికీ తన విజన్‌ని దృష్టిలో పెట్టుకొని తనే మెగా ఫోన్ పట్టుకోవాలని డిసైడ్ అయినట్టు సూచిస్తుంది. ఈ సినిమా తమ సొంత బేనర్ అయిన స్రవంతి మూవీస్‌లోనే చేయబోతున్నారని సమాచారం. మరి డైరెక్ట్‌గా రామ్ సక్సెస్ అయి హీరోగా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
3 . వారణాసికి షాక్ ఇచ్చిన హైదరాబాద్ వాటర్ బోర్డు!
మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందించిన భారీ చిత్రం వారణాసి చిత్రం కోసం గగన్ పహాడ్ ఏరియాలో సెట్‌లో మే 18 నుంచి నీటి అడుగున కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరచేందుకు ప్లాన్ చేశారు. ఆ సన్నివేశాలకి శుద్ధి చేస్తే నీరు చాలా అవసరం అవుతుంది. సుమారు పదివేల లీటర్లు కావాలనేది అంచనా. దీంతో పదివేల లీటర్ల కెపాసిటీ ఉన్న 150 ట్యాంకర్ల నీరు కావాలని టీం హైదరాబాద్ వాటర్ బోర్డుకి దరఖాస్తు చేసుకుంది. కానీ నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు నీటి కొరత కూడా ఉండటంతో వాటర్ బోర్డు వారణాసి టీం రిక్వెస్ట్ ని రద్దు చేసింది. మరి ఊహించని ఈ సంఘటనతో షూట్ ని పోస్ట్ పోన్ చేస్తారా లేక వేరే మార్గాలతో స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి.
4 . వామ్మో మరి అంత రేటా.. వ’ర్క’వుట్ అవుతుందా?
సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ మూవీ జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జైలర్ 2 పై తెలుగు నాట కూడా మంచి క్రేజ్ ఉంది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పంపిణీ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది. జైలర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల గ్రాస్ సాధించడంతో సీక్వెల్ రైట్స్‌కు 60 కోట్లు ధర నిర్ణయించారు. అయితే జైలర్ తర్వాత వచ్చిన పరాజయాలతో అంత రేటుతో సినిమా తీసుకుంటే వ’ర్క’వుట్ అవుతుందా అనే చర్చలు మొదలయ్యాయి.
5 . జన నాయకన్ రిలీజ్ డేట్ వచ్చేసిందా.. కట్స్ లేకుండానే రాబోతోందా!
‘అప్పడి పోడు పోడు… అసతి పోడు పోడు కన్నాలే’ అనే తన మాస్ సాంగ్ తరహాలోనే ఇళయ దళపతి విజయ్ తమిళనాడు ఎలక్షన్స్ లో మెజారిటీ సీట్స్ తో దూసుకుపోతున్నాడు. సిఎం అయ్యే ఛాన్స్ కూడా ఉండటంతో విజయ్ అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. దీనితో సెన్సార్‌లో ఇరుక్కున్న విజయ్ లేటెస్ట్ మూవీ జననాయగన్ మరో వారం రోజుల్లోనే థియేటర్స్‌లోకి రాబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొసమెరుపు ఏంటంటే ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండానే రిలీజ్ అవుతుందట.
6 . విజయోత్సాహంలో విజయం.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
ఇళయ దళపతి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని ఎక్కబోతున్నార’న్న వార్తతో తెలుగు ఇండస్ట్రీలో సంతోష వాతావరణం నెలకొని ఉంది. రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్, సందీప్ కిషన్, డాక్టర్ రాజశేఖర్, విజయ్ దేవరకొండతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విజయ్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
7 . నన్ను చంపెయ్యమని కోరానంటున్న సుప్రీత
ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత మాట్లాడుతూ నేను బరువు తగ్గాలంటే ఆరాటంలో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను.పదిహేను గంటలు ఏమి తినకుండా ఉండేదాన్ని.. తినే ఒక్కపూట కూడా బిర్యానీ వంటి హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నది. దీంతో తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నాను. డైలీ పదిహేను సార్లు వాంతులు. వాటర్ తాగినా కూడా సేమ్ సిట్యువేషన్..ఒక దశలో నన్ను చంపేయమని కోరానని చెప్పుకొచ్చింది.
8 . వైరల్ గా మారిన సాయిపల్లవి
తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ సాయి పల్లవి హిందీలో ఏక్ దిన్ తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా చేశాడు. ఇప్పుడు ఈ మూవీ డివైడ్ టాక్ తో దూసుకుపోతుంది..సాయి పల్లవి రామాయణం చేస్తున్న వేళ ఏక్ దిన్ ఫలితం ఆసక్తికరంగా మారింది.
9 . రూటు మార్చిన శ్రీలీల
స్టార్ హీరోలందరితో గ్లామర్ రోల్స్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్న శ్రీలీల ఇప్పుడు తన రూట్ మార్చుకుంటున్నట్లు తెలుస్తుంది . ఇకపై నటనకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ లో చేయడానికి ఫిక్స్ అయినట్లుగా సమాచారం.
10 .విశ్వంభర నుంచి త్రిష పిక్ వైరల్
ఎట్టకేలకు విశ్వంభర నుంచి అప్ డేట్ వచ్చింది. ఈ రోజు త్రిష పుట్టిన రోజు కావడంతో మేకర్స్ త్రిష లుక్ ని రివీల్ చేసారు. అవని గా విశ్వంభరలో చిరుతో సందడి చేయనుంది. దీపపు కాంతుల మధ్య వెలిగిపోతున్న అవని లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది.
.webp)