
ముద్ర, తాండూర్:
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వికారాబాద్ జిల్లా
తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్స్ లోప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక (99 రోజుల ప్రణాళికలో) భాగంగా “రైతువారోత్సవాల” ముఖ్యాంశంగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేంద్రీయ ఉత్పత్తుల మొబైల్ యాప్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ ప్రాంత రైతుల పట్ల, ప్రజల పట్ల, ఈ ప్రాంతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని, సీఎం రేవంత్ రెడ్డి కూడా తాండూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఏది అడిగిన కాదనకుండా అమలు చేస్తానని అంతటి పలుకుబడి మనోహర్ రెడ్డికి మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా
ఈ జిల్లాలో ఫాం ఆయిల్ తోటలు ఎక్కువగా పండించాలని, మీ ప్రాంతంలో ఆయిల్ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు.అధిక దిగుబడి కోసం ఫర్టిలైజర్ ఎక్కువ వాడకూడదని, మనందరం భూములను, పర్యావరణాన్ని, మన ఆరోగ్యాలను కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు.
ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి రైతుల పొలాలకు నీరు అందిస్తామన్నారు.
ఆర్థిక ఇబ్బంది ఉన్నా రైతులకు ఎన్నికల్లో హామీ మేరకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులు పండించిన పంటలకు ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్నలు కొనుగోలు చేసి వారికి కూడా 500 బోనలు ఇచ్చి ఆదుకుంటున్న కాంగ్రెస్ రైతులకు అండగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. తాండూర్ నియోజకవర్గం కోటిపల్లి ప్రాజెక్ట్, జుంటుపల్లి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ప్రత్యేక కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో వలె శిలాఫలకాళ కె పరిమితం కాకుండా ప్రజల కళ్ళముందే అభివృద్ధి చేసి చూపిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సహాయ కార్యదర్శి సురేంద్రమోహన్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైసిపి చైర్మన్ రజాక్, కమిటీ చైర్మన్లపై నరసింహులు, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.