తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు సంచలనంగా మారింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 47 మంది మావోయిస్టు కేడర్లు జనజీవన స్రవంతిలోకి చేరారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసుల వివరాల ప్రకారం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)కు చెందిన కీలక కమాండర్ హేమ్లాతో పాటు 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని అధికారులు తెలిపారు. లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు 32 ఆయుధాలు, 515 తూటాలను పోలీసులకు అప్పగించారు. ఇది భద్రతా దళాలకు పెద్ద ఎత్తున అధికారులు సూచించారు.
మీడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్రంలో శాంతి భద్రతల బలోపేతానికి ఇది కీలక అడుగని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు–పునరావాస విధానంపై విశ్వాసం పెరగడంతోనే మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కీలక నాయకులు కూడా ఈ లొంగుబాటులో ఉన్నారు. వీరిలో దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్‌చార్జి హేమ్లా, డివిజనల్ కమిటీ సభ్యుడు మరియు 9వ ప్లాటూన్ కమాండర్ పోడియం లచ్చు @ మనోజ్ వంటి నాయకులు ఉన్నారు. ఈ లొంగుబాటుతో దక్షిణ బస్తర్ డీజీపీ దాదాపు నిర్వీర్యమైందని.
అదేవిధంగా, PLGA బెటాలియన్ నుంచి 4 మంది, DKSZC నుంచి 28 మంది, 9వ 30వ ప్లాటూన్ల నుంచి 15 మంది లొంగిపోయినట్లు పోలీసులు ఉన్నారు.ఇంకా అజ్ఞాతంలో ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరశేఖర్ అలియాస్ సంతోషం, స్టేట్ కమిటీ సభ్యుడు జాడి సుజాబాయి, స్టేట్ కమిటీ సభ్యుడు జాడి సుజాబాయి లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.గత రెండేళ్లలో మొత్తం 818 మంది మావోయిస్టులు లొంగిపోగా, 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల బలోపేతానికి ఇది మరో కీలక ముందడుగని ఆయన అన్నారు.
