Home సినిమా తమిళనాడు నో చేంజ్ అని చెప్పిన అజిత్!.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం – Andhra Waves

తమిళనాడు నో చేంజ్ అని చెప్పిన అజిత్!.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


ఇందుగలడందులేడని సందేహము లేదు తండ్రి నారాయణుడు అన్ని చోట్ల ఉన్నాడని అన్నట్టుగా ఒక హీరో అంటే గిట్టని మరో హీరో అభిమానులు అన్ని చోట్లా ఉంటారు. తమిళనాడులో అయితే మరి ఎక్కువ. ఎవరి ప్రాపర్టీ ఎవరు లాక్కోకపోయినా ద్వేషం అనేది మాత్రం కామన్. ఈ ప్రాసెస్‌లో వాస్తవాన్ని కూడా ఆలోచించలేరు. అలాంటి ఒక వాస్తవాన్ని ఆలోచించకుండానే విజయ్ ఫ్యాన్స్ అజిత్ పై నోరు పారేసుకుంటున్నారు. దీంతో అజిత్ టీం వివరణ ఇచ్చింది. పూర్తి మ్యాటర్ చూద్దాం.

నిన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో అజిత్(అజిత్)తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అజిత్ ని చుట్టూ ముట్టిన విలేకర్లు’ తమిళనాడులో ‘మార్పు తద్యమా’ అని అడిగారు. నో నెవర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విజయ్(విజయ్)అభిమానులు పలు చోట్ల అజిత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు . దీనితో పరిస్థితిని గమనించిన అజిత్ మేనేజర్ నో నెవర్ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ అజిత్ గారు నో నెవర్ అనే ఆన్సర్ ని మార్పు తద్యమా అనే ప్రశ్నకి చెప్పలేదు. వేరే ప్రశ్నకి ఇప్పుడు వద్దు అని వారిస్తూ ఇంగ్లీష్ లో చెప్పాడని తెలియచేసాడు. దీంతో విజయ్ అభిమానులు శాంతించారు.

ఇది కూడా చదవండి: D4vd: ప్రముఖ సింగర్ డిక్కీలో 14 ఏళ్ల బాలిక శవం.. నాలుగు నెలల పాటు కారులోనే

విజయ్,అజిత్ తమిళ సినీ పరిశ్రమకి రెండు కళ్ళు. ఆ మధ్య వృత్తిపరమైన పోటీ ప్రధానంగా, వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతు విజయ్ తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలను నేను గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు. అసలు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి, అజిత్ అభిమానులు కూడా ఆయనకు మద్దతు ఇస్తారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమయ్యాయి. గతంలో విజయ్ రాజకీయ సభల్లో కొందరు అజిత్ అభిమానులు కనిపించడం ఆ వార్తలకి మరింత బలాన్ని చేకూర్చింది. అయితే అజిత్ టీం ఆ వేదికపై వచ్చిన వార్తలపై ఏ రాజకీయ పార్టీకి అజిత్ మద్దతు తెలపడం లేదు, అయన పేరు, ఫోటోలని ఏ రాజకీయ వాడకూడదని ఒక నోట్ రిలీజ్ చేసారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird