తమిళ చిత్రసీమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. విజయ్ రాకతో తమిళనాడు రాజకీయ సమీకరణలు మారుతాయా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా విజయ్‌ని తన మిత్రపక్షం నేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారితీశాయి.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ పదేళ్ల పాటు ఓపికగా పోరాడి నేడు ఈ స్థాయికి చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ 014లో పార్టీ పెట్టడానికి, తక్షణ అధికారం కోసం పాగా వేయకుండా క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాడారు. ఓటములు ఎదురైనా వెరవకుండా, వెన్ను చూపకుండా నిలబెట్టు. ఆ నిబద్ధతే నేడు ఆయనను ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా మార్చిందని చంద్రబాబు చెప్పారు. విజయ్ కూడా అదే బాటలో పయనిస్తేనే ఫలితం ఉంటుందని చంద్రబాబు పరోక్షంగా సూచించారు. సినిమా క్రేజ్ ఓట్లను తెచ్చిపెట్టొచ్చు కానీ.. రాజకీయాల్లో స్థిరపడాలంటే ప్రజలతో మమేకం కావడమొక్కటే మార్గమని చంద్రబాబు చెప్పారు.
తమిళనాడులో ఇప్పటికే డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన శక్తులు ఉన్నాయి. ఈ తరుణంలో విజయ్ తన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాగైతే తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు సృష్టించుకున్నారో, విజయ్ కూడా అదే తరహాలో యువతను, మహిళలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు. చంద్రబాబు మాటల్లో కూడా ఇదే వ్యూహం ఏర్పడింది.
మరోవైపు, పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించడం వారిరువురి మధ్య ఉన్న బ్యాండింగ్ కు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలకు సిద్ధపడ్డారని చంద్రబాబు పవన్ ప్రత్యేకంగా చెప్పడం కూటమి ధర్మాన్ని ఆయన తు.చ. తప్పకుండా పాటిస్తున్నారనడానికి తార్కాణంగా చెబుతున్నారు. మొత్తానికి విజయ్ రాజకీయ ప్రయా ణం సాఫీగా సాగాలన్న ఆశాభావం వ్యక్తం చేసిన చంద్రబాబు.. నిలదొక్కుకుని రాణించాలంటే మాత్రం పవన్ కల్యాణ్ ను మోడల్ గా చెప్పకనే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
