Home సినిమా గేదెల రాజు.. నాకే వాడిని చంపాలనిపించేంత కోపం వచ్చింది! – Andhra Waves

గేదెల రాజు.. నాకే వాడిని చంపాలనిపించేంత కోపం వచ్చింది! – Andhra Waves

by
0 comments
tmdb-header-middle-logo


రఘు కుంచే (రఘు కుంచె) టైటిల్‌ రోల్ పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’ (గేదెల రాజు). కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్. రఘు కుంచె తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మోటూరి టాకీస్‌ ​​పతాకంపై కుంచే సమర్పిస్తున్న ఈ రఘు చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ అయిన నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే.

– నేను యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గా గతంలోనూ కొన్ని చిత్రాలకు పనిచేశాను. కానీ “గేదెల రాజు” సినిమా నాకు సమ్ థింగ్ స్పెషల్ అనిపించింది. సినిమా ఆద్యంతం సాగే క్యారెక్టర్ లో నటించాను కాబట్టి సినిమా మీద కమాండ్ ఏర్పడింది. అది మ్యూజిక్ చేసేప్పుడు చాలా ఉపయోగపడింది. మా మూవీలో బీజీఎం చాలా న్యాచురల్ గా కుదిరింది. ఈ మధ్య సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ క్యారెక్టర్స్ ను డామినేట్ చేస్తోంది. అప్పట్లో శివ, గీతాంజలి లాంటి మూవీస్ మనం గమనిస్తే పెరుగుతుందని మీగడల క్యారెక్టర్ ను బీజీఎం మరింత అందంగా చేసేది. ఇప్పుడు బీజీఎం అంటే శబ్దంలా మారిపోయింది. మా మూవీలో నేను ఆ జాగ్రత్త తీసుకున్నాను. క్యారెక్టర్ ను ఎక్కడా బీజీఎం డామినేట్ చేయకుండా, సెటిల్డ్ గా కంపోజ్ చేశాను. పాటలు కూడా కథను ముందుకు నడిపించేలా సిచ్యువేషనల్ గా ఉంటాయి. మూడు సాంగ్స్ లో ఒకటి నేను, మరొక పాట బేబక్క, ఇంకోటి మంగాదేవి పాడారు. బీజీఎంకు 45 రోజుల టైం ఇచ్చారు. కేజీఎఫ్, కల్కి వంటి మూవీస్ కు సౌండ్ డిజైన్ చేసిన రాజరత్నం గారి దగ్గర పనిచేసిన హరీష్ మా మూవీకి సౌండ్ డిజైన్ చేశారు. డాల్బీలో చూస్తే మా మూవీ సౌండింగ్ బాగా ఆకట్టుకుంటుంది.

– ఈ సినిమాలో నా క్యారెక్టర్ భయపెట్టేలా ఉండాలి, అలా కనిపించేందుకు 12 కేజీల బరువు పెరిగాను. మైత్రీ శశిగారు సినిమా చూసి మీరు అప్పట్లో చేసిన టెలివిజన్ కార్యక్రమాలు చూసి సాఫ్ట్ గా ఉంటాననుకున్నా, ఈ క్యారెక్టర్ లో భయపెట్టారు. సినిమా చూసిన వాళ్లంతా నా క్యారెక్టర్ మాస్ అప్పీల్ తో బాగుందని చెప్పారు. ఈ నెల 17న మూవీ రిలీజ్ అనుకున్నాం. అయితే అప్పటికి థియేటర్స్ కన్ఫర్మ్ కాలేదు. ఆ టైం లో మధుర శ్రీధర్ రెడ్డి గారు నెక్ట్స్ వీక్ కు వెళ్లొచ్చు కదా అన్నారు. మేమూ ఆలోచనలో పడ్డాం. ఆ తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా సెట్ అవుతూ వచ్చాయి. నైజాంలో మైత్రీ వాళ్లు 100కు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఏపీ తెలంగాణలో కలిపి 200 స్క్రీన్స్, అలాగే ఓవర్సీస్ లో 60 లొకేషన్స్ లో మా సినిమా రిలీజ్ అవుతోంది. ఇలాంటి చిన్న సినిమాకు ఇది హ్యూజ్ రిలీజ్ అంటే చెప్పుకోవచ్చు.

– ఈ సినిమాలో మ్యాటర్ ఉంది, కానీ వీళ్ల దగ్గర మూటలు లేవు. చైతన్య సినిమా కోసం డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు. ప్రతి డిపార్ట్ మెంట్ దగ్గరుండి చూసుకునేవాడు. ఏడాదిగా తిప్పలు పడుతున్నారు. సినిమా పట్ల వీళ్లకున్న ప్యాషన్ చూసి ప్రొడక్షన్ లో నేనూ భాగమయ్యా. సహజంగా నేను ప్రతి ఒక్కరికీ వందశాతం ఎఫర్ట్స్ పెడతా. ఈ సినిమాకు ఇంకాస్త నా అవసరం ఉందనిపించింది. అందుకే ప్రెజెంటర్ గా మారాను.

– ఈ సినిమాలో నా పాత్ర గోదావరి జిల్లా యాసలో మాట్లాడాలి. నేను గోదావరి జిల్లా వాడిని కాబట్టి ఈ క్యారెక్టర్ లో నటించడం సులువైంది. బరువు పెరిగి, పొట్టతో రెడీ అయిన నాకు ఆ పాత్ర ఆవహించింది. నేను గతంలో ఉండే ఒక మూవీలో తెలంగాణ యాసలో పాత్ర పోషించాను. ఆ యాస నాకు అలవాటు లేదు కాబట్టి ఇబ్బందిపడ్డాను. ఈ సినిమా రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ఫిష్ మార్కెట్ లో చేసిన సీన్స్ లో అక్కడి వాళ్లంతా వాళ్ల వాళ్ల పనులు చేసుకుంటూ సహజంగా మా మూవీలో కనిపించారు. ఇంటర్వెల్ ఫైట్ ఆకర్షణగా నిలుస్తుంది. ఆ ఫైట్ లో డూప్ కత్తులు దొరక్క నిజం కత్తులు వాడారు. అవి ఎక్కడ గాయపరుస్తాయో అని భయమేసింది. ఒక సీన్ లో భాగంగా ఫిష్ మార్కెట్ లో రాత్రంతా ఉండాల్సి వచ్చింది. నటుడిగా హ్యాపీగా ఉంటే సినిమాలే కాదు, ఇలా కష్టపడే సందర్భాలు వస్తాయి.

– గేదెల రాజు క్యారెక్టర్ ను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం చూస్తుంటే నాకే వాడిని చంపాలనిపించేంత కోపం వచ్చింది. రేపు మీరు సినిమా చూశాక ఏమంటారో అనిపిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఆర్టిస్టుగా, మ్యూజిక్ డైరెక్టర్ గా బాగా పర్ ఫార్మ్ చేశావని ప్రశంసిస్తున్నారు. అయితే ఆర్టిస్టుగానే కాస్త ఎక్కువ క్రెడిట్ తీసుకుంటాను. మూవీస్ రెగ్యులర్ గా చూస్తే ఆడియన్స్ కొన్ని సినిమాల ఫేట్ మారుస్తుంటారు. మూవీ లవర్స్ కు మా సినిమా తప్పకుండా నచ్చుతుందని నమ్మకం ఉంది.

– విలన్ గానే నటించాలని లేదు. ఆఫర్స్ రావడాన్ని బట్టి ముందుకు వెళ్తుంటా. అఖండ 2 రైటర్ కల్యాణ చక్రవర్తి రూపొందించిన సినిమా ఒకటి చేస్తున్నాను. అల్లరి నరేష్ గారి సినిమాలోనూ ఒక మంచి రోల్ చేస్తున్నా.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird