
ముద్ర కూకట్‌పల్లి:
కైతలాపూర్ డంపింగ్ యార్డ్‌లోని చెత్తకుప్పలో బుధవారం సాయంత్రం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండగా, మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.నరసింహ అనే వ్యక్తి డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.కూకట్‌పల్లి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి చికిత్స.
పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడు ఎవరనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.