రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, ఇక మీడియా సంస్థ ద్వారా ప్రజాసేవ చేస్తానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, పూర్తి తటస్థంగా వార్తలను అందిస్తామని హామీ ఇచ్చారు.అయితే ఆయన మీడియా సంస్థ ప్రకటన చేసి, తాను తటస్థంగా ప్రజా పక్షాన గొంతెత్తుతానని ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే ఆయన వైఖరి మారింది. తటస్థం అన్నది ఒక ముసుగే అని అవగతమయ్యేలా ఆయన సోషల్ మీడియా పోస్టులు ఉంటున్నారు.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ ఛానల్ అని కూడా విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు తెలిపారు. తాను పాత విజయసాయిరెడ్డినేనని పరోక్షంగా, అన్యాపదేశంగా చాటుకున్నారు. రాజధాని విషయంలో విజయసాయి గంటలో అంటే వైసీపీలో ఉన్న సమయంలో ఏ వైఖరి అవలంబించారో.. అమరావతి వైఖరికి అనుగుణంగానే ఆయన తాజా వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.
అంతెందుకు ఆయన మీడియా సంస్థ ప్రారంభిస్తున్నానన్న ప్రకటనకు అమరావతి ముందు చట్టబద్ధత బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందగానే ఆయన కమ్మరావతి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తటస్థ మీడియా సంస్థ ప్రారంభిస్తున్నట్లు చెప్పిన 24 గంటల వ్యవధిలోనే విజయ సాయి తన జగన్ అనుకూల వైఖరిని వెల్లడిస్తూ, రామచంద్రయాదవ్ కు మద్దతు పలుకుతూ చేసిన ట్వీట్లు ఆయన తటస్థతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తన మీడియా కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ఆయన కొనసాగుతున్న ఈ వైఖరి.. ఆయన మీడియా ఎవరి కోసమే చెప్పకనే చెబుతున్నారని విశ్లేషిస్తున్నారు.
