Home Latest News వరుడు మేకప్ కిట్ ఇవ్వలేదంట…పెళ్లికి నో చెప్పిన వధువు | వరుడు మేకప్ కిట్ | ఉత్తర ప్రదేశ్ | నూర్పూర్ | ఇస్లాం నగర్ | సీఎం యోగి | UP ప్రభుత్వం – Andhra Waves

వరుడు మేకప్ కిట్ ఇవ్వలేదంట…పెళ్లికి నో చెప్పిన వధువు | వరుడు మేకప్ కిట్ | ఉత్తర ప్రదేశ్ | నూర్పూర్ | ఇస్లాం నగర్ | సీఎం యోగి | UP ప్రభుత్వం – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదం కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే. అయితే, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఓ వధువు విభిన్న కారణంతో పెళ్లిని తిరస్కరించడం సంచలనంగా మారింది. వరుడు తనకు మేకప్ కిట్వు తీసుకురాలేదనే కారణంతో వధువు పెళ్లికి నో చెప్పింది. ఈ ఘటన బిజ్నోర్ జిల్లాలో జరిగింది.

జాతీయ మీడియా కథనా ప్రకారం, నూర్‌పూర్ ఇస్లాం నగర్‌లో వధువు కుటుంబం ఘనంగా వివాహ ఏర్పాట్లు చేసింది. వరుడు తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కారులో అక్కడికి చేరుకున్నారు. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని అనుకున్న సమయంలో వధువు ఒక్కసారిగా పెళ్లికి నిరాకరించింది.

తనకు కావాల్సిన మేకప్ కిట్ తీసుకురాలేదని వరుడు, అతని కుటుంబంపై వధువు ఆగ్రహం వ్యక్తం చేశారు. “కనీస అవసరాలు కూడా తీర్చలేని వారు జీవితాంతం నన్ను ఎలా చూసుకుంటారు?” అంటూ ప్రశ్నించింది. వధువు వరుడు షాక్‌తో నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి కోసం తాను రూ.12 లక్షలు ఖర్చు చేసి కారు కొనుగోలు చేశానని చెబుతూ, పెళ్లికి ఒప్పుకోవాలని వేడుకున్నాడు. పెద్దలు మధ్యవర్తిత్వం చేసినా, వధువు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఈ ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. వధువు కుటుంబ సభ్యులు వరుడి కారుపై రాళ్లు విసరడంతో కారు దెబ్బతింది, అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు.

అయితే, ఎంత నచ్చజెప్పినా వధువు తన నిర్ణయంపై నిలబడడంతో, చివరికి వరుడు తన కుటుంబంతో కలిసి వెనుదిరిగాడు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird