Home Latest News 220 పరుగుల విజయలక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసిన పంజాబ్ కింగ్స్ | srhతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం | ఆరు వికెట్లు | శ్రేయస్ | అయ్యర్ – Andhra Waves

220 పరుగుల విజయలక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసిన పంజాబ్ కింగ్స్ | srhతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం | ఆరు వికెట్లు | శ్రేయస్ | అయ్యర్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


క్రికెట్ మజా ఏంటన్నది ఐపీఎల్ 2016 కళ్లకు కడుతోంది. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ కన్నుల పండువగా సాగుతోంది. పరుగుల పండుగ కొనసాగుతోంది. . న్యూ చండీగఢ్ వేదికగా శనివారం (ఏప్రిల్ 11) జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సన్ రైజర్స్ నిర్దేశించిన 220 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఇంకా 1.1 ఓబర్లు మిగిలి ఉండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయింది.

టాస్ కోల్పోయింది ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించారు.

అయితే, భారీ లక్ష్యాన్ని ఛేదించేలా పంజాబ్ కింగ్స్ ఏమీ తడబడలేదు. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య (57), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (51) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. అయితే సన్‌రైజర్స్ బౌలర్ శివాంగ్ కుమార్ ఒకే ఓవర్‌లో వీరిద్దరినీ అవుట్ చేయడంతో సన్ రైజర్స్ మ్యాచ్ పై పట్టు బిగించిందని అనిపించింది. అయితే పంజాబ్ కింగ్స్ స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ ఆశలపై నీళ్లు జల్లాడు. శ్రేయస్ అయ్యర్ కేవలం 33 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్‌లతో విరుచుకుపడి మ్యాచ్‌ను ముగించాడు.

ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. డే/నైట్ మ్యాచ్‌లలో 215 పైచిలుకు భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన తొలి జట్టుగా పుంజుకుంది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird