ఐపీఎల్ వేదికగా అనామక క్రికెటర్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారడం మనం చూస్తాం. కానీ ఆ మెరుపుల వెనుక ఉండే చీకటి గాథలు, కుటుంబాల త్యాగాలు వర్ణనాతీతం. తాజా ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నూ సూపర్ జెయింట్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన 21 ఏళ్ల ముకుల్ చౌదరి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తన ఆటతీరుతో జట్టును ఆడుకోవడమే కాకుండా, తన తండ్రి పడిన కష్టాలకు ఒక సార్థకతను చేకూర్చాడీ యువ సంచలనం.
ముకుల్ ఈ స్థాయికి చేరడం వెనుక అతని తండ్రి దలీప్ చౌదరి అలుపెరుగని పోరాటం ఉంది. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన దలీప్, తన కొడుకును ఎలాగైనా క్రికెటర్‌గా చూడాలని పెళ్లికి ముందే నిశ్చయించుకున్నారు. ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనకున్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ముకుల్‌ను శిక్షణలో చేర్చారు. రియల్ ఎస్టేట్, హోటల్ వంటి వ్యాపారాల్లో నష్టాలు రావడంతో బ్యాంకు అప్పులు తీర్చలేక ముకుల్ చౌదరి తండ్రి దలీప్ చౌదరి జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది.
తండ్రి పడుతున్న బాధను కళ్ళారా చూసిన ముకుల్, తన లక్ష్యంపై దృష్టిసారించి అద్భుతమైన క్రీడాకారుడిగా ఎదిగాడు. వేలంలో లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఇతని కోసం ఏకంగా రూ. 2.6 కోట్లు వెచ్చించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 భారీ సిక్సర్లతో విరుచుకుపడి, తన విలువను నిరూపించుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ముకుల్, తన ఆరాధ్య దైవం ధోనీ తరహాలోనే హెలికాప్టర్ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు.
లఖ్‌నవూ జట్టు ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ ముందే చెప్పినట్లుగా, మైదానం నలుమూలలా షాట్లు ఆడగల సామర్థ్యం ముకుల్ సొంతం. ఈ విజయంతో ముకుల్ తండ్రి ఎంతో ఉద్వేగానికి సిద్ధపడ్డారు. కుమారుడికి వచ్చిన మొత్తంతో తన బ్యాంకు రుణాలను తీర్చేస్తానని ఆయన గర్వంగా చెబుతున్నారు. ముకుల్ రాబోయే మ్యాచుల్లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే, భారత క్రికెట్‌లో మరో ఫినిషర్ దొరికినట్లేనని విశ్లేషకులు. ఇప్పటికే ముకుల్ చౌదరిని అందరూ జూనియర్ ధోనీ అంటే పిలుస్తున్నారు. ఈ యువ ఆటగాడు నిలకడైన ప్రదర్శనతో టీమ్ ఇండియాలోకి అడుగుపెడతాడని ఆశిస్తున్నారు. అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.
.webp)